ఈ నాలుగు సినిమాల్లో ఫైట్స్ చూస్తే ఫ్యాన్స్ కు పూనకాలే.. నో డౌట్!

When Watch Fights Scens In These Four Movies Fan Can Enjoy In Next Level No Doubt

కరోనా రెండవ దశ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యంత భారీ బడ్జెట్ తో స్టార్ హీరోలు పలు చిత్రాలలో నటించారు.ప్రస్తుతం ఈ సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.

 When Watch Fights Scens In These Four Movies Fan Can Enjoy In Next Level No Doubt-TeluguStop.com

ఈ క్రమంలోనే ఈ నెల ఆఖరి వచ్చే ఏడాది టాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యంత భారీ బడ్జెట్ తో స్టార్ హీరోలు నటించిన సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి.ఈ క్రమంలోనే దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో పాన్ ఇండియా స్థాయిలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలలో RRR సినిమా తెరకెక్కింది.

ఈ సినిమా జనవరి 7వ తేదీ విడుదల కానుంది.ఇక ఇందులో ఉన్నటువంటి ఎన్నో ఫైట్ సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని ఇదివరకే ఈ సినిమా నుంచి విడుదల చేసిన ట్రైలర్, పోస్టర్లలో తెలిసిపోయింది.

 When Watch Fights Scens In These Four Movies Fan Can Enjoy In Next Level No Doubt-ఈ నాలుగు సినిమాల్లో ఫైట్స్ చూస్తే ఫ్యాన్స్ కు పూనకాలే.. నో డౌట్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ముఖ్యంగా ఈ సినిమాలో వర్షంలో చేసేటటువంటి ఫైట్ సన్నివేశం తప్పకుండా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చెప్పవచ్చు.

ఇక లెక్కల మాస్టర్ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ ,రష్మిక జంటగా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న చిత్రం పుష్ప.

ఈ సినిమా ఈ నెల 17వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.ఇకపోతే గంధపుచెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అడవిలో జరిగే ఫైట్ సన్నివేశం ఆద్యంతం ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉండబోతోందని తెలుస్తోంది.

ఐదు భాషలలో మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు.ఇక ఇందులో సమంత ఐటమ్ సాంగ్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఇక ఈ సినిమా కోసం అల్లు అర్జున్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

Telugu Salaar, Rajamouli, Fights Scens, Pushpa, Pushpaa, Sarkaruvari, Tollywood-Movie

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు.ఈ క్రమంలోనే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్నటువంటి చిత్రం సలార్.ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ పనులను జరుపుకుంటోంది.

ఇందులో ప్రభాస్ అభిమానులను మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఒక ఫ్యాక్టరీ ఫైట్ సన్నివేశం ఉండబోతుందని ఈ ఫైట్ సీన్ సినిమాకు ఎంతో హైలెట్ అవబోతుందని చిత్ర బృందం భావించారు.ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది.

Telugu Salaar, Rajamouli, Fights Scens, Pushpa, Pushpaa, Sarkaruvari, Tollywood-Movie

ఇక పరశురామ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్నటువంటి చిత్రం సర్కారు వారి పాట. ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకొని వచ్చే ఏడాది వేసవి సెలవులలో విడుదల కానుంది.ఇక ఈ సినిమా బ్యాంకు దోపిడీ నేపథ్యంలో తెరకెక్కనుందని తెలుస్తోంది.ఇందులో భాగంగానే ఈ చిత్రంలో ఎడారిలో ఒక యాక్షన్ సన్నివేశాన్ని తీశారని ఈ సన్నివేశం సినిమాకి హైలెట్ అవుతుందని చిత్ర బృందం వెల్లడించారు.

Telugu Salaar, Rajamouli, Fights Scens, Pushpa, Pushpaa, Sarkaruvari, Tollywood-Movie

ఇక ఇందులో మహేష్ బాబు సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్నారు.ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలు నటిస్తున్నటువంటి ఈ నాలుగు సినిమాలు త్వరలోనే ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయని ఇందులో ఉన్నటువంటి ఈ ఫైట్ సీన్స్ చూస్తే మాత్రం వారి అభిమానులకు థియేటర్లో తప్పకుండా పూనకాలు వస్తాయని చెప్పవచ్చు.ఈ క్రమంలోనే ఈ సినిమాల కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

#Fights Scens #Pushpaa #Sarkaru Paatad #Rajamouli #Pushpa

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube