పెళ్లి వేడుకలు జరుగుతున్న వేళ.. వధూవరులు పరార్..

ఆర్బాటంగా పెళ్లి వేడుకలు జరుగుతున్న వేళ.పెళ్లి మండపం నుంచి వధూవరులు పరారయ్యారు.

 When The Wedding Ceremony Is Going On .. The Bride And Groom Are Gone, Marrege ,-TeluguStop.com

అదేంటి వధూవరు పరారవ్వడమేంటి?  అనుకుంటున్నారా.అవునండీ.

ఈ ఘటన ఒరిస్సా రాష్ట్రంలోని బాలాసోర్ జిల్లాలో చోటుచేసుకుంది.పోలీస్ ఇన్స్పెక్టర్ మధుమిత మహంతి వివరాల మేరకు పశ్చిమబెంగాల్ రాష్ట్రానికి చెందిన వరుడకి బాలాసోర్ పట్టణానికి చెందిన యువతితో వివాహమైంది.

బాలసోర్ పట్టణంలో 16వ నెంబర్ జాతీయ రహదారి పక్కన హోటల్ మంగళ నిలయంలో వివాహ వేడుక గ్రాండ్ గా జరుగుతుంది.పెళ్లి అనుమతి తీసుకున్న నిబంధనల ప్రకారం 25 మంది మాత్రమే వేడుకలో పాల్గొనాలి.

ఎక్కువ మంది అతిథులను పిలిచి ఆర్భాటంగా పెళ్లి చేశారు.ఇందులో కోవిడ్ నిబంధనలు పాటించకుండా పెళ్లి వేడుక జరుగుతుందిని పోలీసులకు సమాచారం అందింది.

వెంటనే పోలీసులు పెళ్లి మండపంలో రంగపవేశం చేశారు.పోలీసులను చూసి వధూవరులు హడలెత్తి అక్కడి నుండి పరారయ్యారు.వధూవరులు పారిపోవడం చూసిన అతిథులంతా నోరెళ్ళబెట్టి అవాక్కయ్యారు.కరోనా నిబంధనల ఉల్లంఘన కేసు నమోదు చేసిన పోలీసులు హాటల్ యజమానికి 3 వేలు వరుడు  తండ్రికి 5 వేలు జరిమానా విధించారు.

ఒడిస్సా రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 2 వేలు నుంచి 5 వేలు వరకు చేరింది.కోవిడ్ నిబంధనల ఉల్లంఘన పై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube