రాజేంద్ర ప్రసాద్ తో ముద్దులు పెట్టించుకున్న అబ్బాయిలు.. అసలేమైందంటే..?

నటుడిగా, నిర్మాతగా, కమెడియన్ గా రాజేంద్ర ప్రసాద్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును, మంచి పేరును సొంతం చేసుకున్నారు.కామెడీ చిత్రాలలో ఎక్కువగా నటించిన రాజేంద్ర ప్రసాద్ ఆ సినిమాలతో విజయాలను సొంతం చేసుకోవడం గమనార్హం.కెరీర్ తొలినాళ్లలో వైవిధ్యంతో కూడిన సినిమాల్లో నటించిన రాజేంద్ర ప్రసాద్ తర్వాత కాలంలో హాస్యంతో కూడిన సినిమాల్లో నటించారు.

 When Students Asked Rajendra Prasad To Kiss Them, Gali Sampath, Kiss Them, Madam-TeluguStop.com

200కు పైగా సినిమాలలో హీరోగా నటించిన రాజేంద్ర ప్రసాద్ మూడు సినిమాలకు నంది అవార్డులను సొంతం చేసుకున్నారు.అయితే రాజేంద్ర ప్రసాద్ ఇంజినీరింగ్ చదివే సమయంలో కాలేజీకి చొక్కా, లాగు వేసుకుని వెళ్లేవారు.కాలేజ్ యానివర్సరీ డే ఫంక్షన్ లో అమ్మాయి వేషం వెయ్యమని రాజేంద్ర ప్రసాద్ ను కోరగా అందుకు రాజేంద్ర ప్రసాద్ అంగీకరించి ఆ వేషం వెయ్యడం గమనార్హం.

రాజేంద్ర ప్రసాద్ నాటకాన్ని అద్భుతంగా ప్రదర్శించగా ఆ తర్వాత లేడీ గెటప్ లో ఉన్న రాజేంద్ర ప్రసాద్ ను మిగతా స్టూడెంట్లు తమకు ముద్దు ఇవ్వాలని గోలగోల చేశారు.ప్రిన్సిపాల్ చెప్పినా వినిపించుకోకుండా రాజేంద్ర ప్రసాద్ తో ముద్దులు పెట్టించుకోవడం గమనార్హం.

హాస్టల్ సెక్రటరీ కూడా రౌండ్స్ కు వచ్చిన సమయంలో రాజేంద్ర ప్రసాద్ ను ముద్దు కావాలని అడిగి ముద్దు పెట్టించుకోవడం గమనార్హం.

Telugu Gali Sampath, Madam, Rajendra Prasad-Movie

రాజేంద్ర ప్రసాద్ సినిమాల్లో నటుడిగా కెరీర్ ను మొదలుపెట్టిన తర్వాత వివాహ భోజనంబు, మేడమ్ సినిమాల్లో లేడీ గెటప్ లో కనిపించారు.సినిమాల్లో లేడీ గెటప్ లో చూసిన ఫ్యాన్స్ లేడీ గెటప్ లో ఆయన నటనను ప్రశంసిస్తూ ఉత్తరాలు రాయడం గమనార్హం.ఈ మధ్య కాలంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తున్న రాజేంద్ర ప్రసాద్ పరిమితంగా సినిమాల్లో నటిస్తున్నారు.

ఈ ఏడాది రాజేంద్ర ప్రసాద్ నటించి విడుదలైన గాలి సంపత్ సినిమాలో రాజేంద్ర ప్రసాద్ నటనకు ప్రశంసలు వచ్చాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube