ఒక చిన్న సెలూన్‌లో అమ్మాయిలతో షేవింగ్‌ చేయించుకున్న సచిన్‌.. ఎందుకో తెలిస్తే హ్యాట్సప్‌ చెప్తారు

ఇండియాలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్‌ ఎక్కడ అయితే ఉంటుందో, క్రికెట్‌ అభిమానులు ఎక్కడ అయితే ఉంటారో అక్కడ క్రికెట్‌ దేవుడు సచిన్‌ టెండూల్కర్‌ గురించి తెలిసే ఉంటుంది.క్రికెట్‌ అంటే సచిన్‌, సచిన్‌ అంటే క్రికెట్‌ అన్నట్లుగా పరిస్థితి మారింది.

 When Sachin Tendulkar Visits A Barber Shop For First Time Ever-TeluguStop.com

అంతటి అద్బుతమైన ఆటతో తనకు తానుగా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు దక్కించుకున్న సచిన్‌ టెండూల్కర్‌ కొన్ని విషయాల్లో ఆకాశాన్ని మించిన ఔనత్యంను కనబర్చుతూ వస్తుంటాడు.అద్బుతమైన తన మంచి తనంతో మరింత అభిమానంను పొందుతున్నాడు.

సచిన్‌ను అభిమానిస్తారు అనడం కంటే ఆరాధిస్తారు అంటే కరెక్ట్‌ అవుతుంది.ఆటకు దూరం అయినా కూడా సచిన్‌ టెండూల్కర్‌ ఇంకా జనాల హృదయాల్లో ఉండటంకు ప్రధాన కారణం ఆయన మంచితనం.

తాజాగా ఆయన మరోసారి తన మంచి తనంను చాటుకున్నాడు.మంచి మనసున్న వ్యక్తిగా సచిన్‌ నిలిచాడు.ఉత్తర ప్రదేశ్‌కు చెందిన నేహా మరియు జ్యోతిలు కుటుంబ బాధ్యతను మోసేందుకు తమ తండ్రి చేసే వృత్తి అయిన బార్బర్‌ షాప్‌ను పెట్టారు.ఆడవారు ఎక్కువగా బ్యూటీ పార్లల్‌లు పెడతుంటారు.

అది కూడా ఆడవారికి మేకోవర్‌ చేయడానికి మాత్రమే.కాని యూపీకి చెందిన ఈ అమ్మాయిలు మాత్రం మగవారి కోసం బార్బర్‌ షాప్‌ను పెట్టి నలుగురికి ఆదర్శంగా నిలుస్తున్నారు.

మగవారే ఈ పని ఎందుకు చేయాలి, మేము చూడా ఈ పని చేయగలం అంటూ నేహా మరియు జ్యోతిలు నిరూపిస్తున్నారు.వీరిని ప్రోత్సహించడంతో పాటు అభినందించే ఉద్దేశ్యంతో జిల్లెట్‌ సంస్థ వీరి వద్దకు సచిన్‌ టెండూల్కర్‌ను తీసుకు వెళ్లడం జరిగింది.

ఒక చిన్న సెలూన్‌లో అమ్మాయిలత

ఆ అమ్మాయిల షాప్‌కు సచిన్‌ వెళ్లడంతో పాటు అక్కడ వారితో షేవింగ్‌ కూడా చేయించుకోవడం ప్రస్తుతం చర్చనీయాంశం అవుతుంది.సచిన్‌ వెళ్లడంతో ఆ బార్బర్‌ షాప్‌కు యూపీలోనే కాదు దేశంలోనే పేరు వచ్చింది.సచిన్‌ చేయించుకున్న వద్ద తాము షేవింగ్‌ చేయించుకోవాలని, సచిన్‌ కూర్చున్న చోట తాము కూర్చోవాలని జనాలు ఆ బార్బర్‌ షాప్‌కు క్యూ కడుతున్నారు.అద్బుతమైన స్పందన వస్తున్న నేపథ్యంలో ఆ బార్బర్‌ సిస్టర్స్‌ చాలా సంతోషంగా ఉన్నారు.

సచిన్‌ను ఇందుకే కదా దేవుడు అనేది అంటూ ఆయన అభిమానులు అంటున్నారు.అమ్మాయిలను ప్రోత్సహించేందుకు వారితో షేవింగ్‌ చేయించుకున్న సచిన్‌ టెండూల్కర్‌ను ఎంతగా పొగిడినా తక్కువే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube