రష్మిక ఇల్లు వెతుక్కుంటూ కర్ణాటకకు వెళ్లిన అభిమాని.. చివరకు..?

సాధారంగా స్టార్ హీరోలకు, స్టార్ హీరోయిన్లకు కొంతమంది వీరాభిమానులు ఉంటారనే సంగతి తెలిసిందే.హీరోలు, హీరోయిన్లపై ఉన్న అభిమానాన్ని ఒక్కో అభిమాని ఒక్కో విధంగా చాటుకుంటూ ఉంటారు.

 When Rashmika Mandanna Fan Search For Her House Here Is What Happened-TeluguStop.com

తాజాగా ఒక వ్యక్తి రష్మికపై అభిమానంతో ఏకంగా ఆమె ఇంటిని వెతుక్కుంటూ వెళ్లడం గమనార్హం.తెలంగాణకు చెందిన వ్యక్తి రష్మికపై అభిమానంతో ఈ పని చేసినట్టు తెలుస్తోంది.

అభిమానులలో కొంతమంది అభిమానులు తమ ఫేవరెట్ హీరోలను, హీరోయిన్లను దేవతలతో సమానంగా పూజిస్తారు.శాండిల్ వుడ్ తో పాటు టాలీవుడ్ లో బాలీవుడ్ లో కూడా రష్మికను అభిమానించే అభిమానులు లక్షల సంఖ్యలో ఉన్నారు.

 When Rashmika Mandanna Fan Search For Her House Here Is What Happened-రష్మిక ఇల్లు వెతుక్కుంటూ కర్ణాటకకు వెళ్లిన అభిమాని.. చివరకు..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఒక ఫ్యాన్ రష్మికను చూడాలని కర్ణాటకకు వెళ్లి ఆమె అడ్రస్ తెలియకపోవడంతో రాత్రంతా రోడ్డుపై తిరుగుతూ ఉన్నారు.ఆ ప్రాంతంలో ఉన్న వాళ్లకు రష్మిక అడ్రస్ గురించి ఆ వ్యక్తి అడిగారు.

ఆ అభిమాని ప్రవర్తన చిత్రవిచిత్రంగా ఉండటంతో స్థానికులు అతని గురించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Telugu Good Bye, Her House, Karnataka, Mission Majnu, Police, Pushpa, Rashimka Home, Rashmika Fan, Rashmika Latest Movies, Rashmika Mandanna, What Happened-Movie

పోలీసులు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారించగా తాను రష్మిక కోసమే అక్కడికి వచ్చానని అభిమాని చెప్పుకొచ్చారు.ఆ వ్యక్తి చెప్పిన మాటలు నిజమేనని నమ్మిన పోలీసులు ఆ వ్యక్తిని విచారించి అక్కడినుంచి పంపించివేశారు.మరోవైపు రష్మిక ఏ ఇండస్ట్రీలో అడుగుపెట్టినా ఆ ఇండస్ట్రీలో గోల్డెన్ లెగ్ గా పేరు సంపాదించుకుంటున్నారు.

Telugu Good Bye, Her House, Karnataka, Mission Majnu, Police, Pushpa, Rashimka Home, Rashmika Fan, Rashmika Latest Movies, Rashmika Mandanna, What Happened-Movie

హిందీలో రష్మిక మిషన్ మజ్ను, గుడ్ బై సినిమాలలో నటిస్తుండగా ఈ రెండు సినిమాలు రిలీజ్ కావాల్సి ఉంది.అమితాబ్ బచ్చన్ గుడ్ బై మూవీలో నటిస్తుండగా మిషన్ మజ్ను మూవీలో సిద్దార్థ్ మల్హోత్రా నటిస్తున్నారు.తెలుగులో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న పుష్ప మూవీలో రష్మిక హీరోయిన్ అనే సంగతి తెలిసిందే.ఈ సినిమాతో పాటు ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమాలో రష్మిక నటిస్తున్న సంగతి తెలిసిందే.

#Her House #Karnataka #Good Bye #RashmikaLatest #Police

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు