ఆ డైలాగ్స్ చెప్పడానికి వణికిపోయిన రజినీకాంత్.. ఏం జరిగిందంటే?

స్టార్ హీరో రజినీకాంత్ అసలు పేరు శివాజీరావు గైక్వాడ్ అనే సంగతి తెలిసిందే.కర్ణాటక రాష్ట్రంలో జన్మించిన రజినీకాంత్ ప్రస్తుతం తమిళనాడులో భారీస్థాయిలో ప్రజాదరణను కలిగి ఉన్న అతికొద్దిమంది నటులలో ఒకరు.

 When Rajinikanth Scared To Dailogues In English Movie Blood Stone Details, Engli-TeluguStop.com

ఏడు పదుల వయస్సులో కూడా రజినీకాంత్ సినిమా ఆఫర్లతో బిజీగా ఉండగా రజినీ నటించిన అన్నాత్తే సినిమా దీపావళి కానుకగా రిలీజ్ కానుంది.జయాపజయాలతో సంబంధం లేకుండా నటుడిగా రజినీకాంత్ కెరీర్ ను కొనసాగిస్తున్నారు.

దాదాపుగా 40 సంవత్సరాలుగా వరుస సినిమా ఆఫర్లతో రజినీకాంత్ బిజీగా ఉన్నారనే విషయం తెలిసిందే.రజినీకాంత్ తెలుగు, తమిళ సినిమాలలోనే ఎక్కువగా నటించగా ఒక అమెరికన్ సినిమాలో కూడా నటించారు.

బ్లడ్ స్టోన్ పేరుతో తెరకెక్కిన ఆ సినిమా 1988వ సంవత్సరంలో విడుదలైంది.సినిమాకు కీలకమైన పాత్రలో రజినీకాంత్ నటించగా డ్వైట్ హెచ్ లిటిల్ అనే ప్రముఖ దర్శకుడు ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.

మన దేశంలోని పలు కీలక ప్రాంతాలలో సైతం ఈ సినిమా షూటింగ్ జరగడం గమనార్హం.

Telugu Rajinikanth, Rajnikathscared, Scared-Movie

బ్లడ్ స్టోన్ సినిమాలో రజినీకంత్ ట్యాక్సీ డ్రైవర్ పాత్రను అద్భుతంగా పోషించి మెప్పించారు.ఆ సినిమాలో ఇంగ్లీష్ లో డైలాగ్స్ చెప్పాల్సి ఉండటం, రజనీకాంత్ కు ఇంగ్లీష్ బాగా రాకపోవడంతో ఆయన తెగ టెన్షన్ పడ్డారు.అయితే ఆ తరువాత నిర్మాతలు ట్యూటర్ ను నియమించి రజనీకాంత్ తో డైలాగ్ చెప్పించారు.

Telugu Rajinikanth, Rajnikathscared, Scared-Movie

1988 సంవత్సరం అక్టోబర్ 7వ తేదీన విడుదలైన ఈ సినిమా అబవ్ యావరేజ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది.ఒమెగా ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కింది.ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్టై ఉంటే రజినీకాంత్ మరిన్ని తమిళ సినిమా ఆఫర్లతో ఖచ్చితంగా బిజీ అయ్యేవారని చెప్పవచ్చు.ఈ మధ్య కాలంలో సరైన సక్సెస్ లేని రజినీకాంత్ అన్నాత్తే సినిమాపై ఆశలు పెట్టుకున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube