ఎన్టీఆర్ కారుకు ఎదురుగా వచ్చిన నిజమైన పెద్దపులి.. ఆ తర్వాత ఏమైందంటే?

సీనియర్ ఎన్టీఆర్ సినీ కెరీర్ లో పదుల సంఖ్యలో బ్లాక్ బస్టర్ హిట్లు ఉన్నాయి.నిజ జీవితంలో ఎన్టీఆర్ ఎంతో ధైర్యవంతుడనే సంగతి తెలిసిందే.

 When Ntr Car Encounters A Tiger Interesting Facts Details, Devata Movie, Senior-TeluguStop.com

సినిమాలకు తక్కువ మొత్తమే పారితోషికంగా తీసుకున్న ఎన్టీఆర్ నిర్మాతలకు నష్టాలు వచ్చిన సమయంలో ఆదుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి.సీనియర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కి సక్సెస్ సాధించిన సినిమాలలో దేవత సినిమా కూడా ఒకటి.1965 సంవత్సరంలో విడుదలైన ఈ సినిమా ఘన విజయం సాధించింది.

ఈ సినిమాలోని ఆలయాన వెలిసిన ఆ దేవుని రీతి పాట పాపులర్ కావడంతో పాటు ఈతరం ప్రేక్షకుల్లో కూడా ఈ పాటకు ఎంతోమంది అభిమానులు ఉన్నారు.

ప్రముఖ హాస్య నటులలో ఒకరైన పద్మనాభం ఈ సినిమాను నిర్మించగా హేమాంబరధరరావు ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.మహానటి సావిత్రి ఈ సినిమాలో సీనియర్ ఎన్టీఆర్ కు జోడీగా నటించగా పద్మనాభం ఈ సినిమాలో వరహాలు అనే పాత్రలో నటించారు.

ఈ సినిమాలో ఒక పాట కొరకు సావిత్రి మొదట లొకేషన్ కు వెళ్లిపోయారు.ఆ తర్వాత కారులో పద్మనాభం, సీనియర్ ఎన్టీఆర్ కారులో డ్రైవర్ తో పాటు లొకేషన్ కు వెళ్లారు.

Telugu Padmanabhan, Devata, Padmanabham, Senior Ntr, Seniorntr, Senior Ntr Car,

పాట షూటింగ్ కొరకు సాతనూరు అనే ప్రాంతానికి వెళ్లాల్సి ఉండగా తిరవణ్ణామలై అనే ప్రాంతం వచ్చిన సమయంలో తనను నిద్ర లేపాలని చెప్పి సీనియర్ ఎన్టీఆర్ పడుకున్నారు.అయితే సీనియర్ ఎన్టీఆర్ పడుకున్న సమయంలో చెంగల్ పట్టు ప్రాంతం దగ్గర ఎన్టీఆర్ వెళుతున్న కారుకు పెద్దపులి ఎదురైంది.

Telugu Padmanabhan, Devata, Padmanabham, Senior Ntr, Seniorntr, Senior Ntr Car,

డ్రైవర్ గజగజా వణకగా పద్మనాభం కూడా పెద్దపులిని చూసి భయపడ్డారు.నిద్రలో ఉన్న ఎన్టీఆర్ కు ఈ విషయం తెలియదు.తిరవణ్ణామలైకు వచ్చిన తర్వాత ఎన్టీఆర్ ను నిద్రలేపి పద్మనాభం ఈ విషయాన్ని చెప్పగా పెద్దపులి రావడం మంచిదని నన్ను నిద్రలేపి ఉంటే చూసేవాడినని సీనియర్ ఎన్టీఆర్ పద్మనాభంకు బదులిచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube