'ఆదిపురుష్'పై పెరుగుతున్న అంచనాలు.. మ్యాచ్ కాలేకపోతున్న మేకర్స్!

బాహుబలి సిరీస్ తర్వాత ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిపోయాడు.ఈయన స్టార్ డమ్ ముందు మరే హీరో నిలువలేడు అనేది అతియసోక్తి కాదేమో.

 When Is The Prabhas Adipurush Movie Update Coming Details, Prabhas , Adipurush Movie , Om Raut, Adipurush Movie Update, Saif Ali Khan, Pan World Movie, Kriti Sanon, Prabhas Adipurush-TeluguStop.com

ప్రెజెంట్ ప్రభాస్ చేతిలో నాలుగైదు ప్రాజెక్టులు ఉన్నాయి.ఇటీవలే రాధేశ్యామ్ సినిమాతో వచ్చి ప్రేక్షకులను నిరాశ పరిచాడు.

బాహుబలి అంతటి ఘన విజయం తర్వాత ప్రభాస్ నుండి వచ్చిన సాహో, రాధేశ్యామ్ రెండు సినిమాలు కూడా డార్లింగ్ ఫ్యాన్స్ ను నిరాశ పరిచాయి.దీంతో ఈయన తర్వాత సినిమా అప్డేట్ కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.

 When Is The Prabhas Adipurush Movie Update Coming Details, Prabhas , Adipurush Movie , Om Raut, Adipurush Movie Update, Saif Ali Khan, Pan World Movie, Kriti Sanon, Prabhas Adipurush-ఆదిపురుష్#8217;పై పెరుగుతున్న అంచనాలు.. మ్యాచ్ కాలేకపోతున్న మేకర్స్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

మరి ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న సినిమాల్లో ఆదిపురుష్ ఒకటి.పాన్ ఇండియా నుండి పాన్ వరల్డ్ లెవల్లో రిలీజ్ కు రెడీ అవుతున్న సినిమా ఆదిపురుష్ కావడంతో ఈ సినిమా కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ప్రెసెంట్ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపు కుంటున్న ఈ సినిమా అప్డేట్ కోసం ఎదురు చూడని అభిమానులు లేరు.

కానీ మేకర్స్ మాత్రం ఇంకా ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు.

ఈ నెలలో అప్డేట్ వస్తుంది అని.మరో నెలలో వస్తుంది అని న్యూస్ వైరల్ అవుతూనే ఉన్నాయి.కానీ ఇప్పటి వరకు ఒక్క అప్డేట్ కూడా రాకపోవడం గమనార్హం.ఎన్ని అంచనాలు ఉన్న కూడా ప్రేక్షకుల అంచనాలను మేకర్స్ మ్యాచ్ చేయలేక పోతున్నారు అనే మాటలు వినిపిస్తున్నాయి.

Telugu Adipurush, Kriti Sanon, Om Raut, Pan, Prabhas, Saif Ali Khan-Movie

మోస్ట్ అవైటెడ్ గా ఎదురు చూస్తున్న ఆదిపురుష్ సినిమా సరైన అప్డేట్ లేకపోవడంతో డార్లింగ్ ఫ్యాన్స్ తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు.ఈ క్రమంలోనే మరొక అప్డేట్ ఫ్యాన్స్ లో ఆశలు చిగురించేలా ఉన్నాయి.ఈ సినిమా అక్టోబర్ లో ట్రీట్ భారీగా ఉంటుంది అని ఇటీవలే ఒక వార్త వచ్చిన విషయం తెలిసిందే.ఇక ఇప్పుడు అక్టోబర్ లో వచ్చే ట్రీట్ కు సంబందించిన అప్డేట్ సెప్టెంబర్ లోనే రాబోతుంది అంటూ కొత్త టాక్ వినిపిస్తుంది.

Telugu Adipurush, Kriti Sanon, Om Raut, Pan, Prabhas, Saif Ali Khan-Movie

ఏది ఏమైనా ఈ సినిమా అప్డేట్ అప్పుడు ఇప్పుడు అంటూ వార్తలు వస్తుంటే ఫ్యాన్స్ కూడా కన్ఫ్యూజ్ అవుతున్నారు.ఫ్యాన్స్ లో అంచనాలు ఉన్నప్పుడే అప్డేట్ ఇస్తే ఆ అంచనాలు పెరుగుతాయి.అలా కాదని ఇలా డిస్సపాయింట్ చేస్తే ఈ సినిమాపై ఉన్న అంచనాలు వదిలేస్తారు.అప్పుడు మేకర్స్ ఏం చేసిన ఏం లాభం ఉండదు.

ఇక ఈ సినిమాను టి సిరీస్ సంస్థ 500 కోట్ల ఖర్చు చేసినట్టు టాక్.ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ కానుంది.

ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా నటిస్తుంటే.సీతగా కృతి సనన్ నటిస్తుంది.

లంకేశ్వరుడు రావణాసురిడిగా సైఫ్ అలీ ఖాన్ నటిస్తుండగా.లక్ష్మణ్ గా సన్నీ సింగ్ నటిస్తున్నాడు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube