భోజనం తరువాత నీటిని ఎలా త్రాగాలి..     2017-09-15   01:53:15  IST  Lakshmi P

నీళ్ళు త్రాగడం..మంచి నీళ్ళు త్రాగడం రెండిటికి చాలా తేడా ఉంది. పూర్వం కాలువల్లో ప్రవహించే నీటిని ఒడిసిపట్టి త్రాగే వాళ్ళు ఇప్పుడు అలాంటి పరిస్థితి ఎక్కడా లేదు. బావులలో ఉండే నీళ్ళు సైతం కాలుష్యం అవుతున్నాయి.ఈ సమయంలో నీటిని త్రాగేటప్పుడు జాగ్రత్తలు తీసుకోకపోతే అనారోగ్య సమస్యలు అనేకం ఉత్పన్నమవుతాయి.అలాగే నీటిని తగినంతగా తాగకపోయినా కూడా అనేక రకాల సమస్యలు వస్తాయి.

ఆరోగ్యానికి మంచి నీరు త్రాగడం చాలా మంచిది..కాచి చల్లార్చిన నీటిని త్రాగితే వాటిలో ఉండే క్రిములు నశిస్తాయి..ఈ విషయం అందరికి తెలిసినదే కానీ మనం త్రాగే నీటిలో కొంచం తులసి ఆకులు నులిమి వేయడం వలన తులసిలో ఉండే గుణాలు నీటిని శుద్ది చేస్తాయి. ఇప్పడు చాలా మంది ఎదుర్కునే సమస్య ఒక్కటే నీటిని సరిగా త్రాగాక పోవడం.

చాలా మంది నీరు ఎక్కువ సేవించకపోవడం వల్ల అనేకమైన అనారోగ్య సమస్యలకి లోనవుతుంటారు.ముఖ్యంగా ఎక్కువగా శ్రమించే వాళ్ళు ..పని ఎక్కువగా చేసేవాళ్ళు శరీరంలో నీటి స్థాయి చెమట రూపంలో బయటకి పోతుంది. పని వత్తిడిలో వీరు నీటిని తీసుకోరు ఇలాంటివాళ్ళు ఎక్కువగా డీ హైడ్రేషన్ తో బాధ పడుతుంటారు.అంతేకాదు కిడ్నీ లో రాళ్ళు ఏర్పడటానికి ప్రధానమైన కారణం నీళ్ళని శరీరానికి సరిపడా త్రాగాకపోవడమే.