మెగాస్టార్ చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసాకా వరుస పెట్టి సినిమాలు తీస్తూ జోరు మీద ఉన్నాడు.ప్రస్తుతం చిరంజీవి 152 వ సినిమా గా ఆచార్య తెరకెక్కుతుంది.
ఈ సినిమా ను కొరటాల శివ ఎంతో ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో తెరకెక్కి స్తున్నాడు.ఈ సినిమాలో చిరంజీవి తనయుడు రామ్ చరణ్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నాడు.
సిద్ద అనే పవర్ ఫుల్ రోల్ లో రామ్ చరణ్ కనిపిస్తున్నారు.
ఇందులో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ కనిపిస్తుంటే రామ్ చరణ్ కు జోడీగా పూజ హెగ్డే నటిస్తుంది.
ఇప్పటికే షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుంది.రెండు పాటలు మాత్రమే బాలన్స్ ఉన్నాయని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
ధర్మస్థలి బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కమర్షియల్ అంశాలను జోడించి కొరటాల శివ అద్భుతంగా తెరకెక్కిస్తున్నాడు.

అయితే ఈ సినిమా మే లోనే విడుదల అవ్వాల్సి ఉండగా కరోనా సెకండ్ వేవ్ కారణంగా మళ్ళీ వాయిదా పడాల్సి వచ్చింది.మళ్ళీ ఇప్పుడిప్పుడే పరిస్థితులు చక్కబడి థియేటర్స్ ఓపెన్ అవ్వడంతో ఒక్కొక్క సినిమా రిలీజ్ అవ్వడానికి రెడీ అవుతుంది.ఇప్పటికే పెద్ద సినిమాలన్నీ రిలీజ్ డేట్ ముందే బ్లాక్ చేసి పెట్టుకోవడంతో ఇప్పుడు ఆచార్య సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడు ప్రకటిస్తారా అని అభిమానులు ఎదురు చూస్తున్నారు.

అయితే ఈ సినిమాను అక్టోబర్ నెలలో రిలీజ్ చెయ్యాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.కానీ అక్టోబర్ 13న ఇప్పటికే ఆర్ఆర్ఆర్ రిలీజ్ కన్ఫర్మ్ అవ్వడంతో.నెలాఖరున ఈ సినిమాను రిలీజ్ చేసే అవకాశం ఉందని తెలుస్తుంది.అలా కుదరకపోతే క్రిస్మస్ కానీ సంక్రాంతికి కానీ రిలీజ్ డేట్ బ్లాక్ చూస్తున్నారట.అయితే చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 22న రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇచ్చే అవకాశాలు ఉన్నట్టు టాక్.చూడాలి మరి రిలీజ్ డేట్ పై ఎప్పుడు క్లారిటీ ఇస్తారో.