ఆ సీన్ కోసం బట్టలు లేకుండా రోడ్డుపై నడిచిన శ్రీకాంత్.. చివరకు?

సినిమాల్లో హీరోగా సక్సెస్ సాధించాలంటే సులువు కాదు.కొన్ని సీన్ల కోసం ఎంతో శ్రమించాల్సి ఉంటుంది.

 When Hero Srikanth Walked Naked On The Road , Actor Srikanth , Operation Duryoda-TeluguStop.com

హీరో శ్రీకాంత్ కెరీర్ తొలినాళ్లలో ఎక్కువగా ఫ్యామిలీ హీరో రోల్స్ లో నటించి విజయాలను సొంతం చేసుకున్నారు.అయితే ఒక దశలో శ్రీకాంత్ కు వరుస ఫ్లాపులు ఎదురు కావడంతో కొత్త తరహా కథాంశాలపై ఆయన దృష్టి పెట్టారు.శ్రీకాంత్ నటించిన సినిమాలలో ఆపరేషన్ దుర్యోధన ఒకటనే సంగతి తెలిసిందే.

2007 సంవత్సరంలో పోసాని కృష్ణమురళి డైరెక్షన్ లో తెరకెక్కి ఈ సినిమా రిలీజైంది.ఈ సినిమాలలో కొన్ని సన్నివేశాల్లో శ్రీకాంత్ బట్టలు లేకుండా నడిరోడ్డుపై నడిచే సన్నివేశాలు ఉంటాయి.అయితే ఆ సీన్ కోసం శ్రీకాంత్ నిజంగానే బట్టలు లేకుండా నడిచాడని సమాచారం.

సాధారణంగా ఇలాంటి సీన్లను హీరోలు డూప్ లతో చేయించడానికి ఇష్టపడతారు.అయితే శ్రీకాంత్ మాత్రం రిస్క్ తీసుకుని ఆ సీన్ లో నటించారని తెలుస్తోంది.

Telugu Ameer Pet, Ameerpet, Naked Road, Road, Duryodhana, Srikanth, Tollywood-Mo

పోసాని కృష్ణమురళి కథ చెప్పే సమయంలోనే ఆ సీన్ కచ్చితంగా చేయాలని శ్రీకాంత్ కు సూచించగా శ్రీకాంత్ అందుకు అంగీకరించారు.నిత్యం జనాలతో బిజీగా ఉండే అమీర్ పేట్, బేగంపేట్, చార్మినార్ ఏరియాలలో ఆ సీన్ షూటింగ్ జరిగింది.శ్రీకాంత్ ముఖంపై గాటుతో తక్కువ జుట్టుతో ఉండటంతో ఆయనను ఎవరూ గుర్తు పట్టలేదు.కొత్త వేషం కావడంతో ఎవరూ గుర్తు పట్టకపోవడం శ్రీకాంత్ కు ప్లస్ అయింది.

Telugu Ameer Pet, Ameerpet, Naked Road, Road, Duryodhana, Srikanth, Tollywood-Mo

సినిమా కోసం పని చేస్తున్న వాళ్లకు మాత్రమే శ్రీకాంత్ బట్టలు లేకుండా రోడ్డుపై నడిచాడనే విషయం తెలుసు.సినిమాకు ఆ సీన్ హైలెట్ గా నిలిచిన సంగతి తెలిసిందే.ఆపరేషన్ దుర్యోధన మూవీ హిట్ కావడానికి ఆ సీన్ కూడా ఒక కారణమనే సంగతి తెలిసిందే.కళ్యాణి, ముమైత్ ఖాన్ ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube