ఆరోజు కొండపై గౌతమి ప్రాణాలే పోయేవట.. ఎవరు కాపాడారంటే..?

తెలుగులో తక్కువ సినిమాలే చేసినా నటిగా గౌతమి తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారు.వైజాగ్ లో ఇంజినీరింగ్ చదివే సమయంలో గౌతమికి సినిమాల్లో నటించే అవకాశం వచ్చింది.

 When Gautami Almost Fell Down From Hill In An  Outdoor Shoot, Almost Fell Down,-TeluguStop.com

తెలుగులో దయామయుడు అనే సినిమాతో గౌతమి సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వగా తమిళంలో గురు శిష్యన్ అనే సినిమాతో గౌతమి ఎంట్రీ ఇచ్చారు.గౌతమి చేసిన పాత్రలు నటిగా ఆమెకు మంచి పేరును తెచ్చిపెట్టడం గమనార్హం.

అయితే ఒక సినిమా షూటింగ్ సమయంలో గౌతమికి కొండపై ప్రాణాపాయం తప్పిందట.ఏళు సుత్తిన కోటే అనే కన్నడ మూవీ కొరకు గౌతమి కుద్రేముఖ్ అనే ప్రాంతానికి వెళ్లారు.

అంబరీష్ ఆ సినిమాలోని హీరో పాత్రలో నటించారు.స్క్రిప్ట్ ప్రకారం గౌతమి అంబరీష్ ను పిలుస్తూ కొండపై నుంచి కిందికి దిగాల్సి ఉంటుంది.

గౌతమి కొండపై నుంచి కిందకు దిగే సమయంలో కొండపై ఉండే ముళ్లు, పిఛ్కి మొక్కల వల్ల ఆమె దిగడానికి ఎంతో కష్టపడాల్సి వచ్చింది.

చీరలో ఉన్న గౌతమి గబగబా దిగుతున్న సమయంలో ఆమె కాలికి ఒక రాయి తగిలింది.

అదే సమయంలో చీర కుచ్చిళ్లు గౌతమి కాళ్ల కింద పడటంతో గౌతమి ముందుకు తూలగ సినిమాకు పని చేస్తున్న ఒక వ్యక్తి వెంటనే వేగంగా స్పందించి ఆమె కొండపై నుంచి కింద పడకుండా కాపాడారు.యూనిట్ సభ్యుడు సరైన సమయానికి స్పందించకపోయి ఉంటే మాత్రం గౌతమి ప్రాణాలకే ప్రమాదం వాటిల్లేది.

Telugu Fell, Gautami, Green Siganl, Outdoor, Tamil-Movie

గౌతమి తెలుగుతో పోలిస్తే తమిళంలోనే ఎక్కువ సంఖ్యలో నటించారు.సెకండ్ ఇన్నింగ్స్ లో గౌతమి గుర్తింపు తెచ్చిపెట్టే పాత్రలకు ఎక్కువగా గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఇస్తుండటం గమనార్హం.ఈ మధ్య కాలంలో గౌతమి తెలుగులో నటించిన మనమంతా సినిమా ఆమెకు నటిగా మంచి పేరును తెచ్చిపెట్టింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube