అందులో పడ్డాకే తెలిసింది.. ఓ బావిపై ఇల్లు కట్టారని...!

ఎవరైనా ఇంటికి ముందు లేదా వెనుకో బావిని ఏర్పాటు చేసుకుంటారు.అయితే అమెరికాలోని కనెక్టికట్ లో బావి పై ఓ ఇంటిని కట్టేశారు.

 When Falldown Into That Only It Is Known That A House Was Built Upon A Well,amer-TeluguStop.com

అయితే ఆ విషయం ఆ ఇంటివారు బావిలో పడేవరకు ఇంట్లో నివసిస్తున్న వాళ్లకు వారు బావిపై నివసిస్తున్నారని విషయం మరిచిపోయారు.సదరు ఇంట్లో నివసిస్తున్న ఓ వ్యక్తి తన కోసం వచ్చిన స్నేహితుడి కోసం సామాన్లు సర్దుతున్నాడు.

అయితే ఆ సమయంలో అనుకోకుండా తను నిలబడి ఉన్న ఫ్లోర్ విరిగి 30 అడుగుల లోతులో పడిపోయాడు.

ఈ పరిణామంతో 30 అడుగుల లోపల దెబ్బల నుండి తేరుకొని చూడగా అతను పడింది బావిలో అని గ్రహించాడు.

అంతేకాదు ఆ బావి లో సుమారు ఆరు అడుగుల వరకు నీళ్లు ఉండడం గమనార్హం.ఈ విషయంలో మరో అదృష్టం ఏమిటంటే సదరు వ్యక్తి బావిలో పడినప్పుడు అతని జేబులో మొబైల్ ఫోన్ ఉండటంతో వెంటనే సదరు ప్రాంతానికి చెందిన పోలీసులకు ఫోన్ చేసి తాను బావిలో పడినట్టు తెలియజేశాడు.

తనను రక్షించాలని పోలీసులను కోరడంతో వెంటనే పోలీసులు అగ్నిమాపక సిబ్బంది తో సహా తన ఇంటికి చేరుకున్నాడు.అయితే వారు అక్కడ బావి కనిపించకపోవడంతో మరోసారి అతనికి ఫోన్ చేసి బావి ఎక్కడ ఉందని అడగ్గా, వారిని ఇంట్లో కి రమ్మని చెప్పడంతో అక్కడ వారు బావిని చూసి పోలీసులు ఆశ్చర్యపోయారు.

Telugu America, Floor, Well, Falldown Well-Latest News - Telugu

వారు అక్కడికి వచ్చి చూడగా 30 అడుగుల లోతులో తాను ఉన్నానని తనని రక్షించాలని కోరగా ముందుగా తాడు సహాయంతో ఒకరు లోపలికి దిగి తనని బయటికి తీశారు.చాలాసేపు సదరు వ్యక్తి చల్లని నీళ్లలో ఉండడంతో అస్వస్థతకు గురయ్యాడు.అయితే ఇంట్లో ఇంత పెద్ద బావి ఎలా వచ్చిందో తెలియక పోయిందా అని ఆరా తీయగా అప్పుడు అసలు నిజం బయటికి తెలిపారు.వారు నివసిస్తున్న భవనాన్ని 1843 సంవత్సరంలో నిర్మించారని, ఆ సమయంలో ఆ బావి ఇంటి బయటే ఉండేదని… అయితే 1981 సంవత్సరంలో మా ఇంటికి మరమ్మతులు చేయగా ఆ బావిపై సాధారణ చెక్కతో ఫ్లోర్ నిర్మించారని తెలియజేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube