ఈ ఏడాది వైకుంఠ ఏకాదశి ఎప్పుడు వచ్చింది.. వైకుంఠ ఏకాదశి ప్రాముఖ్యత ఏమిటో తెలుసా?

హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి ఏడాది పుష్యమాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అని పిలుస్తారు.ఈ ఏకాదశి పండుగనే ముక్కోటి ఏకాదశి అని, పుత్ర ఏకాదశి అని కూడా పిలుస్తారు.

 When Did Vaikhunta Ekadasi Came And What Is Its Significance Details, Vaikuntha-TeluguStop.com

ఈ రోజు భక్తులు పెద్ద ఎత్తున శ్రీహరికి కఠిన ఉపవాసాలతో పూజలు చేసి స్వామి వారి అనుగ్రహాన్ని పొందుతారు.ఎంతో పవిత్రమైన ఈ వైకుంఠ ఏకాదశి రోజు స్వామివారిని పూజించడం వల్ల మోక్షం లభిస్తుందని భావిస్తారు.

ఇలా ఉపవాసం ఉండి స్వామివారికి పూజ చేసే సమయంలో తప్పనిసరిగా ఉపవాస కథను చదవాలి.హిందువులు ఎంతో పవిత్రంగా భావించే ఈ వైకుంఠ ఏకాదశి ఈ ఏడాది ఎప్పుడు వచ్చింది వైకుంఠ ఏకాదశి ప్రాముఖ్యత ఏమిటి అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం…

హిందూ క్యాలెండర్ ప్రకారం ఈ ఏడాది వైకుంఠ ఏకాదశి 2022 జనవరి 12వ తేదీ బుధవారం వచ్చింది.

అయితే ఏకాదశి ఏకాదశి తిథి 12వ తేదీ సాయంత్రం4:49 కి ప్రారంభమై మరుసటిరోజు అంటే 13 వ తేదీ సాయంత్రం7:32 వరకు ఏకాదశి తిథి ఉంటుంది.ఈ క్రమంలోనే చాలామంది 12వ తేదీ సాయంత్రం నుంచి ఉపవాసం ఉండి స్వామి వారిని పూజిస్తారు.

ఇక ఈ సమయంలో భక్తులు పెద్ద ఎత్తున స్వామివారి దర్శనార్థం ఆలయాలకు చేరుకుంటారు.అయితే వైకుంఠ ఏకాదశి రోజు శ్రీహరి ఆలయాలలో ఉత్తర దిశ దర్శన భాగ్యం కల్పిస్తారు.

ఈ ద్వారం గుండా వెళ్లి స్వామివారి దర్శనం చేసుకోవటం వల్ల మరణాంతరం వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని భావిస్తారు.

ఈ క్రమంలోనే భక్తులు ఉదయమే నిద్రలేచి శ్రీహరిని పూజించిన అనంతరం ఆలయాలకు వెళ్లి స్వామివారి దర్శన భాగ్యం అనంతరం తీర్థ ప్రసాదాలను తీసుకుంటారు.అయితే ఈ వైకుంఠ ఏకాదశినే పుత్రద ఏకాదశి అని కూడా పిలుస్తారు.ఈ క్రమంలోనే ఎవరైతే పుత్ర సంతానం కావాలని భావిస్తారో అలాంటి వారు వైకుంఠ ఏకాదశి రోజు పుత్ర సంతాన వ్రతం చేయటం వల్ల వారికి పుత్ర సంతానం కలుగుతుందని పండితులు చెబుతున్నారు.

అయితే ఈ వ్రతం చేసుకోవడానికి 13వ తేదీ మధ్యాహ్నం వరకు ఎంతో అనువైన సమయం అని చెప్పవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube