ఆమ్మో ఆసుపత్రిలో దెయ్యం,చూస్తే ఆశ్చర్యపోతారు!

దెయ్యాలు ఉన్నాయా లేవా అంటే మాత్రం ఎవరూ కన్ఫార్మ్ గా చెప్పలేము.ఎవరికీ వారికి ఆ దెయ్యాల పట్ల కొన్ని కొన్ని ఎక్స్ పీరియన్స్ లు గనుక ఉంటె మాత్రం అవి ఉన్నాయా లేదా అన్నది చెప్పగలుగుతారు.

 Wheelchair Moves Individually In Chandighrh Hospital Security Guard-TeluguStop.com

కానీ వాస్తవానికి దెయ్యాలు అనేవి ఉండవన్నది నగ్న సత్యం.చాలా మంది ఇది ఒక మూఢ నమ్మకం మాత్రమే అంటూ కొట్టేపడేసే వారు కూడా లేకపోలేదు.

కానీ చండీఘడ్ లో చోటుచేసుకున్న ఒక ఘటనకు సంబందించిన వీడియో ను చూస్తే మాత్రం నిజంగా దెయ్యాలు ఉన్నాయా అన్న అనుమానం మాత్రం కలగక మానదు.పీజీఐ హాస్పిటల్‌లో ఓ వీల్ ఛైర్ (చక్రాల కుర్చీ) ఎవరి ప్రమేయం లేకుండా దానికదే కదిలిన ఘటన చండీఘడ్ లోని ఒక హాస్పిటల్ లో చోటుచేసుకుంది.

సెక్యూరిటీ గార్డు చూస్తుండగానే అది కదులుతూ ముందుకు వెళ్లిపోయింది.ఇదంతా హాస్పిటల్‌లో ఉన్న సీసీటీవీ కెమేరాలో రికార్డైంది.

తొలుత అది గాలి వల్ల కదిలి ఉంటుందని ఆ సెక్యూరిటీ గార్డు భావించాడు.బయటకు వెళ్లి చూస్తే.

గాలి వీయక పోగా, దాన్ని ఎవరో చక్రాలు కదుపుతూ ముందుకు తీసుకెళ్తున్నట్లుగా అనిపించింది.దీంతో ఆ హాస్పిటల్‌లో చనిపోయిన వ్యక్తుల ఆత్మ వల్లే ఆ వీల్ ఛైర్ కదిలి ఉంటుందనే ప్రచారం మొదలైంది.

ఇదివరకు కూడా ఈ హాస్పిటల్‌లో ఇలాంటి ఘటనే ఒకటి చోటుచేసుకున్నట్లు తెలిసింది.

Telugu Chandighrh, Ghost, Security Guard, Wheelchair-

  హాస్పిటల్‌లోని మార్చురీ వద్ద ఉన్న స్ట్రెచర్ ఇలాగే కదిలింది.దీంతో స్థానికులు ఆ హాస్పిటల్‌లో తప్పకుండా దెయ్యాలు ఉండి ఉంటాయని అనుమానిస్తున్నారు.అయితే ఇప్పుడు తాజాగా ఈ ఘటన కూడా చోటుచేసుకోవడం తో వారి అనుమానానికి బలం చేకూరినట్లు అనిపిస్తుంది.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube