ఫేషియల్ హెయిర్. చాలా మంది అమ్మాయిలకు ఇదో పెద్ద సమస్య.
ఈ ఫేషియల్ హెయిర్ వల్ల ముఖ సౌందర్య తీవ్రంగా దెబ్బ తింటుంది.అందుకే ఫేషియల్ హెయిర్‌ను తొలిగించుకునేందుకు తరచూ బ్యూటీ పార్లర్స్‌కే వెళ్లి ఎంతో ఖర్చు చేసి వ్యాక్సింగ్ చేయించుకుంటారు.
కానీ, ఇంట్లోనే గోధుమ పిండితో చాలా సులభంగా ఫేషియల్ హెయిర్‌ను రిమూవ్ చేసుకోవచ్చు.మరి గోధుమ పిండిని స్కిన్‌కు ఎలా ఉపయోగించాలి అన్నది లేట్ చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో రెండు స్పూన్ల గోధుమ పిండి, ఇక స్పూన్ శెనగ పిండి, ఒక స్పూన్ ములేతి పౌడర్, ఒక స్పూన్ తేనె మరియు రోజ్ వాటర్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని హెయిర్ ఉన్న చోట అప్లై చేసి డ్రై అవ్వనివ్వాలి.
అనతరం వేళ్లతో మెల్ల మెల్లగా రుద్దుకుంటూ వాటర్‌తో క్లీన్ చేసుకోవాలి.ఇలా రెండు రోజులకు ఒక సారి చేస్తూ ఉంటే ఫేషియల్ హెయిర్ క్రమంగా తొలిగిపోతుంది.

అలాగే ఒక బౌల్‌లో అర కప్పు నిమ్మ రసం, ఒక కప్పు షుగర్, అర కప్పు వాటర్ వేసుకుని బాగా హీట్ చేయాలి.అపై ఈ మిశ్రమాన్ని చల్లారనిచ్చి అందులో గోధుమ పిండిని కలుపు కోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమంతో వ్యాక్ చేసుకోవాలి.ఇలా చేస్తే బ్యూటీ పార్లర్‌కు వెళ్లకుండానే ముఖంపై అన్‌వాంటెడ్ హెయిర్ ఈజీగా రిమూవ్ అవుతుంది.
ఇక ఒక బౌల్ తీసుకుని అందులో రెండు స్పూన్ల గోధుమ పిండి, ఒక స్పూన్ మిల్క్ పౌడర్, నాలుగు స్పూన్ల కాచి చల్లార్చిన పాలు వేసి కలుపుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని హెయిర్ ఉన్న చోట పూసి బాగా ఆరనివ్వాలి.
అపై తడి చేతులతో మెల్ల మెల్లగా స్క్రబ్ చేసుకుంటూ వాష్ చేసుకోవాలి.ఇలా చేసినా కూడా మంచి ఫలితం ఉంటుంది.