2020 లో వాట్సాప్ అప్డేట్స్ ఇవే..! మీరు ట్రై చేశారా..?!

ప్రస్తుత రోజుల్లో స్మార్ట్ ఫోన్ వినియోగం సర్వసాధారణం అయిపోయింది.చిన్న పిల్లవాడి నుంచి పెద్దవాళ్ల వరకూ ప్రతి ఒక్కరు కూడా స్మార్ట్ ఫోన్ కు బాగా అలవాటుపడ్డారు.

 New Whatsapp Updates In 2020, Whatsapp Disapperaing Messages, Group Video Call,-TeluguStop.com

స్మార్ట్ ఫోన్ వినియోగదారులు దాదాపు అందరూ వాట్సాప్ వినియోగిస్తుంటారు.ఇక వాట్సప్ కస్టమర్ల కోసం ఎప్పటికి అప్పుడు అప్ డేట్స్ ను తీసుకొని వస్తుంది.

కస్టమర్ల కోసం వాట్సాప్ సంస్థ డార్క్ మోడ్, గ్రూప్ వీడియో కాలింగ్, వాట్సాప్ పే వంటి ఫీచర్లను అప్డేట్ చేస్తూ వచ్చింది.ఫేస్ బుక్ సంస్థ ఆధ్వర్యంలో 2020 లో యూజర్ల కోసం అందుబాటులోకి తీసుకొని వచ్చిన ఫీచర్ల వివరాలు ఎవంటే.

ఈ సంవత్సరం వాట్సాప్ అప్ డేట్స్ లో భాగంగా వాట్సాప్ పేమెంట్స్ సర్వీస్ ను మన భారతదేశంలో ప్రవేశపెట్టింది.ఈ ఫీచర్ కోసం నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI), యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ (UPI) సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంది.

అలాగే భారతదేశంలోని ఇది మొట్టమొదటి రియల్ టైం పేమెంట్ సిస్టం కావడం గమనార్హం.ఈ ఫీచర్ ను యూజర్ లకు అందుబాటు చేయడం కోసం వాట్సాప్ సంస్థ అనేక బ్యాంకులతో ఒప్పందం కుదుర్చుకుంది.

ఆ తర్వాత వాట్సప్ ద్వారా ఇప్పటి వరకు వీడియో కాలింగ్ చేసుకునే అవకాశం ఉంది.ఈ సదుపాయాన్ని అభివృద్ధి చేస్తూ యూజర్ల కోసం వాట్సాప్ గ్రూప్ వీడియో కాల్స్ చేసుకునే సదుపాయం కల్పించింది.

Telugu Messages, Whatsapp Ups, Npci, Qr, Whats-Latest News - Telugu

ఈ గ్రూప్ వీడియో కాల్ ఫీచర్ లో ఎనిమిది మంది లేదా అంతకంటే ఎక్కువ మంది ఉండే వాట్సప్ గ్రూపులలో గ్రూప్ వీడియో కాలింగ్ చేసుకునే అవకాశం కల్పించింది వాట్సాప్ సంస్థ.అలాగే వాట్సాప్ లో మరో అప్డేట్ ఏమిటి అంటే.డిసప్పీయరింగ్ మెస్సేజెస్ ఫీచర్ ని కూడా అందుబాటులోకి తీసుకొని వచ్చింది.ఈ ఫీచర్ ను ఆండ్రాయిడ్, ఐఓఎస్ ఆపరేటింగ్ సిస్టంలో అన్ని ఫోన్లలో పనిచేస్తుంది.

మనము మెస్సేజ్ చేసిన ఏడు రోజుల వరకు అవతలి వ్యక్తి వాట్సాప్‌ ఓపెన్ చేయకపోతే.ఆ చాట్‌ లిస్ట్‌ లోని మెస్సేజ్‌ లు ఆటోమేటిగ్ గా డిలీట్ అయిపోతాయి.

రీ డిజైన్డ్ స్టోరేజ్ మేనేజ్‌మెంట్ ఫీచర్ రీడిజైన్ స్టోరేజ్ మేనేజ్మెంట్ యూజర్ల కోసం ప్రత్యేకంగా రూపుదిద్దారు.ఈ ఫీచర్ ద్వారా డివైస్ తీసుకునే స్టోరేజ్ ను తగ్గిస్తూ ఫోన్ పనితీరును సులువుగా మెరుగుపరచుకోవచ్చు.

ఈ ఫీచర్ ను ఉపయోగిస్తూ వాట్సప్ లో మనకు అవసరం లేని డేటాను మెసేజ్ లను ఒకేసారి డిలీట్ చేసుకుంటూ స్టోరేజ్ పెంచుకునే అవకాశం కల్పిస్తుంది.ఇక వీటితోపాటు యూజర్లు ఐఓఎస్, ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం లో పనిచేసే స్మార్ట్ ఫోన్ వినియోగిస్తున్న వారి కోసం డార్క్ మోడ్ అనే ఆప్షన్ ను అందుబాటులోకి తీసుకుని వచ్చింది.

ఈ ఫీచర్ ద్వారా ఫోన్ లైటింగ్ తక్కువగా చేసుకుంటూ అలాగే యూజర్ కంటిపై ఒత్తిడి పడకుండా సహాయపడుతుంది.ఈ సూచనలు ఉపయోగించడం వల్ల ఫోన్ బ్యాటరీ సామర్థ్యం కూడా మెరుగుపరుస్తుంది.

ఇక ఇంకో ఫీచర్ విషయానికి వస్తే… మ్యూట్ ఆల్వేస్.ఇక ఈ ఫీచర్ ద్వారా వాట్సాప్ గ్రూప్ లేదా వ్యక్తిగత చాట్ వల్ల వచ్చే నోటిఫికేషన్ ను శాశ్వతంగా మ్యూట్ చేసుకునే అవకాశం కల్పిస్తుంది.

అంతేకాకుండా వాట్సప్ యూజర్ల కోసం కస్టమైజబుల్ వాల్‌ పేపర్స్ అనే ఫీచర్ ను కూడా అందుబాటులోకి తీసుకొని వచ్చింది.ఫీచర్ ద్వారా వాట్సాప్ యూజర్లు వ్యక్తిగత చాట్లు గ్రూప్ చాట్ కోసం వారికి నచ్చిన వాల్ పేపర్ సెట్ చేసుకోవచ్చు.

Telugu Messages, Whatsapp Ups, Npci, Qr, Whats-Latest News - Telugu

వాట్సాప్ అడ్వాన్స్‌ సెర్చ్ ఫీచర్ ద్వారా యూజెస్ ఇమేజెస్, వీడియోస్, gif వంటివి చేయడం కోసం సెర్చ్ ఆప్షన్ ద్వారా సులువుగా సెర్చ్ చేసుకోవచ్చు.ప్రస్తుతం చాటింగ్ యాప్స్ లో స్టిక్కర్స్ వరకు చాట్ చేసుకోవడం చాలా ట్రెండ్ గా నిలుస్తుంది.ఇక ఈ ఫీచర్ లో వాట్సాప్ ద్వారా చాట్ చేసుకోవడం కోసం అందుబాటులోకి తీసుకొని వచ్చింది వాట్సాప్.ఇక మరొక ఫీచర్ విషయానికి వస్తే. క్యూఆర్ కోడ్ ద్వారా మనకు తెలిసిన వ్యక్తి కాంటాక్ట్ ను యాడ్ చేసుకునే విధంగా ఫీచర్ లో ప్రవేశపెట్టింది.మాన్యువల్ గా మనం ఫోన్ నెంబర్ టైప్ చేయకుండానే క్యూఆర్ కోడ్ సహాయంతో అవతల వ్యక్తి కాంటాక్ట్ ను సేవ్ చేసుకునే విధంగా డిజైన్ చేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube