త్వరలోనే వావ్ అనేలా వాట్సాప్ సరికొత్త ఫీచర్..!

ప్రపంచంలో అత్యంత ప్రాచుర్యం పొందిన మెసేజింగ్ యాప్ వాట్సాప్.వాట్సాప్ తన వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్ తీసుకొస్తూ ఉంటుంది.

 Whatsapp Wow New Feature Coming Soon, Whatsapp, New Features, Latest News, Vira-TeluguStop.com

ఇక తాజాగా స‌రికొత్త ఫీచ‌ర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.వాట్సాప్ లో కొత్తగా ‘డ్రాయింగ్‌ టూల్’ అనే ఫీచర్ ను అభివృద్ధి చేస్తున్నట్టు వాట్సాప్ తెలిపింది.

ఈ ఫీచర్‌ ద్వారా ప్రొఫైల్ ఫోటోల‌ను ఎడిట్ చేసుకునే అవకాశం ఉంటుంది.ఈ ఫీచర్ ను ఆండ్రాయిడ్ యూజర్ల కోసం అభివృద్ధి చేయనున్నారు.

ఆండ్రాయిడ్ 2.22.3.5 అప్డేట్ కోసం కొత్త వాట్సాప్ బీటా తర్వాత డ్రాయింగ్ ఎడిటర్ కొత్త ఫీచర్ ను విడుదల చేయడానికి వాట్సాప్ ప్లాన్ చేస్తుంది.ఈ కొత్త ఫీచర్ ద్వారా కేవలం ప్రొఫైల్ ఫోటోను ఎడిటింగ్ చేయడం మాత్రమే కాకుండా వీడియో ఎడిటింగ్ కూడా చేసుకోవచ్చు.ఫోటో, వీడియో ఎడిటింగ్ కోసం వేరే యాప్స్ కి వెళ్లనవసరం లేకుండా ఇప్పుడు వాట్సాప్ లోనే అది అందుబాటులోకి రానుంది.

అంతేకాక వాట్సాప్ లో మీ ఫోటోలు, వీడియోలపై గీయడానికి కొత్త పెన్సిల్ లను కూడా యాడ్ చేయాలని ప్లాన్ చేస్తుంది.దీనికోసం మొత్తం మూడు పెన్సిళ్లను యాడ్ చేయనుంది.

మొదటగా ఈ ఫీచర్ వాట్సాప్ బీటా ఆండ్రాయిడ్ యూజర్లకు అందుబాటులోకి రానుంది.ఆ తర్వాత ఐఓఎస్ యూజర్లకు అందుబాటులోకి వస్తుంది.

వాట్సాప్ తాజాగా గ్లోబల్ వాయిస్ నోట్ ప్లేయర్ అనే ఒక కొత్త ఫీచర్ ను కూడా యూజర్లకు పరిచయం చేసింది.దీనిద్వారా మీరు మీ చాట్ బాక్సులో స్క్రోల్ చేస్తూనే వాయిస్ మెసేజ్ లు వినొచ్చు.

ప్రస్తుతం ఈ ఫీచర్ కొన్ని ఐఓఎస్ బీటా టెస్టర్ల యూజర్ల కోసమే విడుదల చేస్తారు.ఇక ఈ ఫీచర్ త్వరలో ఆండ్రాయిడ్ బీటా టెస్టర్ల యూజర్లకు కూడా అందుబాటులోకి రానుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube