అబ్బబ్బబ్బా ... 'వాట్సాప్'లో ఈ సరికొత్త ఫీచర్ అదిరిపోయిందంతే !  

  • ఎప్పటికప్పుడు తమ యూజర్స్ అభిరుచులకు అనుగుణంగా… సరికొత్త ఫీచర్స్ యాడ్ చేస్తూ ఆకట్టుకుంటున్న వాట్సాప్ ఇప్పుడు మరో కొత్త ఫీచర్ ను ప్రవేశపెట్టేందుకు చూస్తోంది. ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో డేటా చోరీ వార్తలు భయపెడుతున్న కారణంగా… అత్యంత పగడ్బందీగా… వాట్సాప్ ఒక సరికొత్త ఫీచర్‌ను త్వరలోనే ప్రవేశపెట్టాలని చూస్తోంది.ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ కోసం Whatsapp Beta వాడుతున్న వినియోగదారులకు, 2.19.3 అనే కొత్త వెర్షన్ విడుదల చేసింది.

  • Whatsapp Working New Finger Print Authenticarion-

    Whatsapp Working New Finger Print Authenticarion

  • వినియోగదారుల సంభాషణలు ఇతరులు చూడకుండా కాపాడేందుకు ఆండ్రాయిడ్ వెర్షన్‌లో వాట్సాప్‌కు ఫింగర్ ప్రింట్ అధెంటికేషన్ ఆప్షన్ ను డవలప్ చేసింది. ఇకపై ఎవరైనా… ఎవరైనా మన వాట్సాప్ ను ఓపెన్ చేయాలన్నా… కుదరదు. ఈ ఫీచర్ నిర్దిష్ట సంభాషణలను కాపాడటమే కాదు, మొత్తం యాప్‌కు భద్రత ఇస్తుందని ఇతరులకు మన వాట్సాప్ యాక్సెస్‌ను నియంత్రిస్తుందనీ అంటే వాట్సాప్‌లో మన చాటింగ్‌కు స్పెషల్‌గా లాక్ పెట్టుకోవాల్సిన అవసరం లేకుండా డైరెక్టుగా యాప్‌కే ఫింగర్ ప్రింట్ ఫీచర్ రక్షణ ఇస్తుంది.