గూగుల్ సెర్చ్‌ లో లీకైన వాట్సాప్ వెబ్ నెంబర్లు.. అందులో మీ నెంబర్ ఉందో లేదో చూసుకున్నారా..?  

google serach, whats appweb, phone numbers leaked,400 millions users, desktop users, pc users,whatsapp web numbers leaked in google search - Telugu 400 Millions Users, Desktop Users, Google Serach, Pc Users, Phone Numbers Leaked, Whats Appweb, Whatsapp Web Numbers Leaked In Google Search

రోజురోజుకు వాట్సాప్ యాప్ సంబంధించిన వివాదాస్పద వ్యాఖ్యలు ఒకవైపు మీడియాలో, మరోవైపు సోషల్ మీడియాలో ఎక్కువయ్యాయి.దీనికి కారణం వాట్సాప్ కొత్త గా తీసుకొచ్చిన వివాదాస్పద ప్రైవసీ పాలసీలో కారణం అని చెప్పవచ్చు.

TeluguStop.com - Whatsapp Web Numbers Leaked In Google Search

పరిస్థితి ఇలా ఉండగా వాట్సప్ సంస్థకు మరో పరిస్థితి తలనొప్పిగా మారింది.వాట్సప్ యూజర్స్ డేటా గూగుల్ ఇండెక్స్ లో అయినట్లు వెలుగులోకి వచ్చింది.

ఇందులో భాగంగానే వాట్సాప్ డెస్క్ టాప్ అప్లికేషన్ ఉపయోగించే వారి డేటా గూగుల్ లో ప్రత్యక్షం అవుతోంది.వాట్సాప్ యూజర్ల సంబంధించి మొబైల్ నెంబర్లు, అలాగే వారు చేసిన చాటింగ్ లు గూగుల్ సెర్చ్ లో కనపడుతున్నట్లు తెలుస్తోంది.

TeluguStop.com - గూగుల్ సెర్చ్‌ లో లీకైన వాట్సాప్ వెబ్ నెంబర్లు.. అందులో మీ నెంబర్ ఉందో లేదో చూసుకున్నారా..-General-Telugu-Telugu Tollywood Photo Image

ఇందులో భాగంగా వాట్సాప్ యూజర్ల మొబైల్ నెంబర్లు గూగుల్ సెర్చ్ లో కనపడుతున్నట్లు టెక్ నిపుణులు తెలుపుతున్నారు.భారత్ లో వాట్సాప్ ను ఏకంగా 400 మిలియన్ల మంది యూజర్లు ఉపయోగిస్తున్న నేపథ్యంలో ఇలాంటివి జరగడం నిజంగా పెద్ద వివాదానికి దారి తీయబోతోంది.

ఇందులో చాలామంది డెస్క్టాప్ వర్షన్ లో వినియోగిస్తున్నారు.తాజాగా సైబర్ సెక్యూరిటీ రీసెర్చర్ రాజశేఖర్ అనే వ్యక్తి వాట్సాప్ నుండి లీకైన వాటిని కొన్ని స్క్రీన్ షాట్ లను చూపించడంతో.

వాట్సప్ అప్లికేషన్ ద్వారా మొబైల్ నెంబర్లు లీక్ అయినట్లు సైబర్ నిపుణులు తెలుపుతున్నారు.

ఇకపోతే వాట్సాప్ యూజర్ ఎవరైనా తమ వాట్సాప్ అకౌంట్ ను లాప్ టాప్ లేదా కంప్యూటర్ లలో లాగిన్ చేసినప్పుడు వారి మొబైల్ నెంబర్లు గూగుల్ సెర్చ్ లో ఇండెక్స్ అయినట్లు నిపుణులు గుర్తించారు.అయితే ఈ మొబైల్ నెంబర్లు బిజినెస్ నెంబర్లు మాత్రం కావని, కేవలం వ్యక్తిగత యూజర్లవని వారు తెలిపారు.అయితే వీటిపై స్పందించిన వాట్సాప్ గ్రూప్ చాట్ లింక్స్ కు సంబంధించి లింక్స్, డాటాను గూగుల్ సెర్చ్ నుండి తొలగించినట్లు వాట్సాప్ ప్రతినిధులు ఓ ప్రకటనలో వెల్లడించారు.

#PhoneNumbers #Desktop Users #Google Serach #Whats Appweb #WhatsappWeb

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు