వాట్సాప్ వీడియో కాల్ వాడేముందు ఇది చదవండి

మొన్నటిదాకా కేవలం బేటా వెర్షన్ వినియోగదారులకే వీడియో కాల్ ఆప్షన్ ని అందించిన వాట్సాప్, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా లెటెస్ట్ వెర్షన్ కి అప్డేట్ అయిన తన వినియోగదారులందరికి వీడియో కాల్ ఆప్షన్ ని ఇచ్చేసింది.వాట్సాప్ వీడియో కాల్ రావడంతో, ఇక స్కైప్, ఫేస్ టైమ్ (ఆపిల్ యూజర్లు), గూగుల్ డ్యుయో లాంటి స్పెషల్ వీడియో కాలింగ్ యాప్స్ వాడాల్సిన అవసరం లేదని సంబరపడిపోతున్నారేమో ! వాట్సాప్ ఇచ్చిన వీడియో కాలింగ్ మరీ ఎక్కువ మార్కులు కొట్టేయలేదు టెక్నాలజీ నిపుణుల దగ్గర.

 Whatsapp Video Calling And It’s Disadvantages-TeluguStop.com

మొదటి కారణం, మిగితా వీడియో కాలింగ్ యాప్స్ తో పోలిస్తే, వాట్సాప్ వీడియో కాలింగ్ ఎక్కువ డేటా ఛార్జ్ చేస్తోందట.ఈ విషయంలో, ఇప్పటికే కొన్ని పరీక్షలు జరిగాయి.

ఫేస్ టైమ్, స్కైప్ తో పోల్చుకుంటే, వాట్సాప్ వీడియో కాలింగ్ లో అధిక డేటా చార్జ్ అవుతోంది.కాబట్టి వైఫై ఉన్నప్పుడే వాట్సాప్ కొత్త ఫీచర్ ని వాడుకుంటే మంచిది.

అలాగే వీడియో కాలింగ్ క్వాలిటి విషయంలో అసంతృప్తి ఉంది.నిజానికి కాల్స్ సరిగా కనెక్ట్ కావడం లేదని కూడా కంప్లయింట్ ఉంది.

కనెక్ట్ అయినా, గూగుల్ డ్యుయో, స్కైప్ క్వాలిటి దీంట్లో లేదని పెదవి విరిచేస్తున్నారు.కాబట్టి, మీ మొబైల్ లో వీడియో కాలింగ్ యాప్ ని డిలీట్ చేసేముందు ఓసారి ఆలోచించండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube