వాట్సప్‌లో కొత్త పీచర్‌.. ఇకపై రెండు పనులు ఒకేసారి చేసేయొచ్చు, ఇది చదవగానే మీరే అప్‌డేట్‌ చేసుకుంటారు

టెక్నాలజీ విపరీతంగా పెరిగి పోయింది.గత నాలుగు అయిదు సంవత్సరాలుగా ప్రపంచాన్ని స్మార్ట్‌ ఫోన్‌లు ముంచెత్తుతున్నాయి.

 Whatsapp Update Youtube Videos Without Leaving Whatsapp Chats-TeluguStop.com

ముఖ్యంగా జియో వచ్చిన తర్వాత స్మార్ట్‌ ఫోన్‌ల యుగం కొత్త పుంతలు తొక్కుతోంది.ఇండియాలో స్మార్ట్‌ ఫోన్‌ల సంఖ్య కోట్లల్లో ఉందని చెప్పనక్కర్లేదు.

ఒక్కరి వద్ద మూడు నాలుగు స్మార్ట్‌ ఫోన్‌లు కూడా ఉంటున్నాయి.ఇక స్మార్ట్‌ ఫోన్‌లు ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా వినియోగించే యాప్‌ వాట్సప్‌.

ఇండియాలోని ప్రతి ఒక్క స్మార్ట్‌ ఫోన్‌ యూజర్‌ వాట్సప్‌ను కలిగి ఉన్నాడనేది ఒక సర్వే చెబుతున్న నిజం.

ఇండియాలో వాట్సప్‌ తనకున్న ఖాతాధారులకు ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్‌ను ఇస్తూనే ఉంది.గతంలో కేవలం సందేశాలు పంపుకోవడం, ఫొటోలను పంపుకోవడం మాత్రమే ఉండేది.ఆ తర్వాత కాలింగ్‌ సదుపాయం వచ్చింది, ఆ తర్వాత వీడియో కాలింగ్‌ సదుపాయం ఇచ్చారు.

ఇంకా ఎన్నో ఎన్నో అప్‌డేట్స్‌ వస్తూనే ఉన్నాయి.అప్‌డేట్‌ వచ్చిన ప్రతి సారి ఏదో ఒక కొత్త పీచర్‌ను వాట్సప్‌ యూజర్లకు ఇస్తూనే ఉంది.

తాజాగా వాట్సప్‌ మరో అద్బుతమైన పీచర్‌ను తీసుకు వచ్చింది.

ఇప్పటి వరకు వాట్సప్‌లో వీడియోలు చూస్తున్న సమయంలో చాట్‌ చేసేందుకు వీలు లేదు.కాని ఇకపై వీడియోలు చూస్తూనే చాటింగ్‌ కూడా చేసుకునే అవకాశం ఉంది.వీడియోలు లెంగ్తీగా ఉన్న సమయంలో ఎక్కువ సమయం చూడాల్సి వచ్చినప్పుడు చాటింగ్‌ చేయడం ఇబ్బందిగా ఉంటుంది.

అందుకే ఈ పీచర్‌ను తీసుకు వచ్చినట్లుగా తెలుస్తోంది.ఒక వైపు వీడియో ప్లే అవుతూ ఉంటుంది.

మరో వైపు చాటింగ్‌ చేసుకోవచ్చు.

ఎవరైనా ఒక వీడియోను పంపించినప్పుడు ఆ వీడియోను విశ్లేషిస్తూ కామెంట్స్‌ రాయడం కూడా దీని ద్వారా సాధ్యం అవుతుందని వాట్సప్‌ ఉన్నతాధికారులు చెబుతున్నారు.ఈ కొత్త పీచర్‌ అందుబాటులోకి వచ్చేసింది.మీరు దీన్ని పొందాలి అంటే మీరు మీ ప్లేస్టోర్‌లోకి వెళ్లి అప్‌డేట్‌ను కొట్టాల్సి ఉంటుంది.ప్రస్తుతం వాట్సప్‌ 2.18.330 వర్షన్‌లో ఇది అందుబాటులోకి తీసుకు వచ్చినట్లుగా వాట్సప్‌ ఒక ప్రకటనలో తెలియజేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube