వాట్సాప్ లో అదిరిపోయే అప్‌డేట్‌.. ఇకపై మెసేజ్‌లను ఎప్పుడైనా డిలీట్ చేయవచ్చు!

Whatsapp Update Messages Can Now Be Deleted Anytime

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ లో ఆల్రెడీ పంపించిన మెసేజ్‌లను ఒక గంటల సమయంలో మాత్రమే అందరికీ డిలీట్ చేయగలం.డిలీట్ ఫర్ ఎవ్రీవన్ అనే ఫీచర్‌తో ఒక గంట ఎనిమిది నిమిషాల సమయంలోగా పంపిన వాట్సాప్ మెసేజ్‌లను డిలీట్ చేయవచ్చు.

 Whatsapp Update Messages Can Now Be Deleted Anytime-TeluguStop.com

అయితే ప్రస్తుతం ఆ టైం లిమిట్ ని వాట్సాప్ పెంచడానికి ప్లాన్ చేస్తోంది.యూజర్లు అప్పుడప్పుడు తాము పంపిన మెసేజ్‌లను ఒకరోజు లేదా రెండు రోజుల తర్వాత డిలీట్ చేయాలి అని అనుకుంటుంటారు.

అలాంటప్పుడు కేవలం గంట వరకు మాత్రమే ఉండే వాట్సాప్ టైం లిమిట్.మెసేజ్‌లను అందరికీ డిలీట్ చేయడానికి అనుమతించదు.

 Whatsapp Update Messages Can Now Be Deleted Anytime-వాట్సాప్ లో అదిరిపోయే అప్‌డేట్‌.. ఇకపై మెసేజ్‌లను ఎప్పుడైనా డిలీట్ చేయవచ్చు-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

దీనివల్ల చాలా మంది యూజర్లు ఇబ్బందులు పడుతున్నారు.దీనికి పరిష్కారంగా డిలీట్ ఫర్ ఎవ్రీవన్ ఫీచర్ టైం లిమిట్ ను ఏడురోజులకు పొడగిస్తూ ఒక కొత్త మార్పును తీసుకు రాబోతోంది వాట్సాప్.

ఈ అప్‌డేట్‌తో 7 రోజుల 8 నిమిషాల క్రితం పంపిన మెసేజ్ లు కూడా డిలీట్ చేయచ్చని వాట్సాప్ బ్లాగ్ వాబీటాఇన్ఫో తెలిపింది.మొదటగా ఈ అప్ డేట్ ఆండ్రాయిడ్ యూజర్లకు ఆ తర్వాత ఐఓఎస్ యూజర్లకు అందుబాటులోకి రానుంది.

గంట తర్వాత కూడా అందరికీ వాట్సాప్ మెసేజ్ లను డిలీట్ చేయడం సాధ్యమవుతుంది.వాట్సాప్ టైం లిమిట్ ను 7 రోజుల 8 నిమిషాలకు పెంచడానికి ప్లాన్ చేస్తోంది.ఈ అప్‌డేట్‌ త్వరలోనే అందరికీ అందుబాటులోకి రానుంది” అని వాబీటాఇన్ఫో తెలిపింది.ఇదిలా ఉండగా కొద్ది రోజుల క్రితం వాట్సాప్ ఇండియన్ యూజర్ల కోసం ఫ్లాష్ కాల్స్, మెసేజ్ లెవెల్ రిపోర్టింగ్ అనే రెండు సేఫ్టీ ఫీచర్స్ పరిచయం చేసింది.

త్వరలోనే మరిన్ని సరికొత్త ఫీచర్లను తీసుకురావాలని వాట్సాప్ యోచిస్తోంది.ప్లే బ్యాక్ స్పీడ్, ఎడిట్ స్టికర్స్, మెరుగైన వాయిస్ రికార్డింగ్ వంటి ఫీచర్లు త్వరలోనే యూజర్లకు పరిచయం చేయాలని వాట్సాప్ ప్రయత్నిస్తోంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube