వాట్సాప్ లో ఓ సూపర్ ఫీచర్ రాబోతోంది

ఈరోజుల్లో ప్రైవసీ చాలా ముఖ్యం.బయటకి చెప్పుకోలేని విషయాలెన్నో మన స్నేహితులతో, సన్నిహితులతో పంచుకోవాలనుకుంటాం.

 Whatsapp To Introduce 6 Digit Password?-TeluguStop.com

ప్రేయసి, ప్రేమికుడితో గంటలకొద్ది చాట్ చేస్తాం.ఇలాంటివి ఎంతో సిక్రేట్ గా, మూడో కంటికి తెలీకుండా ఉండాలి.

ఫేస్ బుక్ లో అయితే పాస్ వర్డ్ ఉంటుంది.ట్విట్టర్ కి కూడా పాస్ వర్డ్ ఉంటుంది.

హైక్ లో సీక్రేట్ చాట్స్ పెట్టుకోవచ్చు.అఖరికి నిన్నగాక మొన్న వచ్చిన గూగుల్ అల్లో కూడా సీక్రేట్ చాట్స్ తో ముందుకొచ్చింది.

కాని జనాలు వీటన్నిటి కన్నా ఎక్కువ వాట్సాప్ వాడుతుంటారు.కాని వాట్సాప్ కే సేఫ్టి లేదు.
ఏదో ఒక థర్డ్ పార్టీ అప్ లాకర్ పెట్టుకుంటే తప్ప, మన మొబైల్ తీసుకోని మన వాట్సాప్ మెసెజ్లన్ని చదివేయొచ్చు ఎవరైనా.అసలు సీక్రేసి అనే మాటే లేదు వాట్సాప్ దగ్గర.

ఓ పాస్ వర్డ్ లేదు, అల్లో లాగా ప్రైవేట్ చాట్ లేదు.ఇన్నిరోజులంటే పోటి లేదు కాబట్టి కథ నడిచింది కాని ఇప్పుడు గూగుల్ లాంటి పెద్ద సంస్థ అల్లో మెసెంజర్ ని పోటిగా దింపేసరికి వాట్సాప్ కి మెలుకువ వచ్చినట్టుంది

అండ్రాయిండ్ నిపుణుల కథనాల ప్రకారం, త్వరలోనే ఓ 6 డిజిట్ పాస్ వర్డ్ ఆప్షన్ ని తన వినియోగదారులకు ఇచ్చే అలోచనలో ఉందట వాట్సాప్.

మీకు మాత్రమే తెలసిన ఆ పాస్ వర్డ్ తో మీ వాట్సాప్ ని మీరే వాడేలా, మీ మెసెజెస్ మరొకరు చదవకుండా ఈ ఫీచర్ ని ప్రవేశపెట్టే అలోచనలో వాట్సాప్ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.ఇదే నిజమైతే వాట్సాప్ ప్రేమికులు మరో ఆప్ వంక చూడాల్సిన అవసరం ఉండదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube