వాట్సప్‌ యూజర్స్ అంతా ఈ కొత్త ఫీచర్‌ గురించి తెలుసుకోండి... మీకో పెద్ద తలనొప్పి తగ్గడం ఖాయం

ఈమద్య కాలంలో వాట్సప్‌ స్టార్మ్‌ ఫోన్‌ లేదు అంటే అతిశయోక్తి కాదు.ఇండియాలో 99 శాతం స్మార్ట్‌ ఫోన్‌ వినియోగదారులు వాట్సప్‌ను వాడుతున్నారు.

 Whatsapp To Give You Option Before Being Added To Groups-TeluguStop.com

ప్రపంచ వ్యాప్తంగా దాదాపుగా 130 కోట్ల మంది వాట్సప్‌ను వాడుతున్నారు.అయితే వాట్సప్‌ వల్ల ఎంత లాభం ఉందో, అంతే చిరాకు కూడా గ్రూప్స్‌ వల్ల కలుగుతుంది.

మన అనుమతి లేకుండానే గ్రూప్‌లలో జాయిన్‌ చేయడం, ఆ తర్వాత ఇష్టం వచ్చినట్లుగా మెసేజ్‌లు, ఫొటోలు, వీడియోలు పంపడం కామన్‌ అయ్యింది.అత్యంత చిరాకు కలిగిస్తున్న వాట్సప్‌ గ్రూప్స్‌ నుండి ఇకపై ఆ తలనొప్పి లేదు.

ఇకపై ఎవరు పడితే వారు, ఎవరిని పడితే వారిని వాట్సప్‌ గ్రూప్‌లో చేర్చడానికి వీలు లేదు.వాట్సప్‌ కొత్త ఫీచర్‌తో వినియోగదారులకు మంచి జరుగబోతుంది.ప్రస్తుతం బీటా వర్షన్‌లో ఈ కొత్త ఫీచర్‌ అందుబాటులో ఉంది.దీంతో మనం ప్రైవసీ సెట్టింగ్‌లోకి వెళ్లి మనని ఎవరైనా గ్రూప్‌లో జాయిన్‌ చేయాలి అంటే మన పర్మీషన్‌ తీసుకోవాలని చెప్పడం అన్నమాట.

ఫేస్‌ బుక్‌లో కనుక ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ ఓకే చేయడం ఎలాగైతే ఉంటుందో, వాట్సప్‌లో కూడా అలాగే ఉంటుంది.

వాట్సప్‌ గ్రూప్‌ల వల్ల చాలా సమస్యలు వస్తున్నాయి.కుటుంబ సభ్యుల గ్రూప్‌, స్టూడెంట్స్‌ గ్రూప్‌, కులం గ్రూప్‌, జాబ్‌ గ్రూప్‌, గ్రామస్తుల గ్రూపు, వీధి గ్రూపు ఇలా పదుల సంఖ్యలో గ్రూప్‌లు ఉంటున్నాయి.ఇలాంటి నేపథ్యంలో వారి నుండి తప్పుకోవాలంటే ఇబ్బంది.

ఎవరైన ఏమైనా అనుకుంటారేమో అని, అలాగే కొనసాగితే కొందరు చిల్లర గాళ్లు చేసే పోస్ట్‌లు, పంపే మెసేజ్‌లు.కొందరు వ్యక్తిగతంగా అందులో చాట్‌ చేసుకుంటూ ఉంటారు.

ఇన్ని సమస్యలున్న గ్రూప్‌ల వల్ల ఇకపై కాస్త అయినా ఉపశమనం కలగడం ఖాయం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube