ఆ విషయాలపై నిఘా పెట్టబోతున్న 'వాట్సాప్'

ఫేస్ బుక్ , వాట్సాప్ ఎప్పటికప్పుడు సరికొత్త ఫ్యూచర్స్ అందుబాటులోకి తీసుకురావడంతో పాటు … వినియోగదారుల భద్రత కోసం చర్యలు తీసుకుంటూనే ఉంది.ఇందుకోసం భారీ స్థాయిలోనే ఖర్చు పెడుతోంది.

 Whatsapp That Raised Intelligence-TeluguStop.com

ముఖ్యంగా తప్పుడు కధనాలు , హింస తదితర విషయాల్లో ఇప్పటికే ఫేస్ బుక్ చర్యలు తీసుకుంది.ఈ క్రమంలో వాట్సాప్ కూడా ఆ బాట పట్టింది.

ఎన్నికల సమయంలో తప్పుడు వార్తలు, కథనాలు, వీడియోలు ప్రచారంపై ఇప్పటికే ఫేస్ బుక్ పెద్ద ఎత్తున నిఘా పెట్టి వాటిని క్రమబద్దీకరించేందుకు చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే.ఇప్పుడు మరో సోషల్ మీడియా దిగ్గజం వాట్సాప్ రంగంలోకి దిగింది.నకిలీ వార్తలు, పుకార్లు, అబద్దపు వార్తలు సర్క్యులేట్ చేయడం, హింసాత్మకచర్యలకు ఉసిగొల్పేవిధంగా చేసే కాల్స్, ఎన్నికలకు సంబంధించిన వివిధ రకాల అక్రమ ప్రతిపాదనలు వంటి వాటిపై సమరం సాగించేందుకు రెడీ అయింది.

2018 బ్రెజిల్ ఎన్నికలు, ఇండోనేషియాతోపాటు వివిధ దేశాల్లో చవిచూసిన అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఇండియాలో ఎన్నికల వేళ జాగ్రత్తలు చేపట్టింది.నకిలీ వార్తలు, విశ్లేషణలపై పోరాడటానికి మిలియన్ డాలర్లు వెచ్చించి 20 పరిశోధన టీంలు రెడీ చేసింది.ఇందుకుగాను సామాజిక శాస్త్రవేత్తలు, సంబంధిత విభాగాలలోని నిష్ణాతుల సాయం తీసుకుంటోంది.

వాట్సాప్ విజిలెంట్స్ పేరుతో ఒక స్పెషల్ డ్రైవ్ కూడా రూపొందించింది.ఒసామా మంజార్, డిజిటల్ సాధికారత ఫౌండేషన్తో కలిసి అనేక దేశాలలో కమ్యూనిటీ నాయకులకు శిక్షణ ఇవ్వడానికి సైతం ప్రణాళికలు రెడీచేస్తోంది.తద్వారా దోషపూరిత సమాచారాన్ని ఎలా పరిష్కరించాలో తెలియజేయనుంది.ఇంటర్నెట్ వినియోగం విపరీతంగా పెరిగిపోవడం, దీనికి తోడు స్మార్ట్ ఫోన్లు సామాన్యప్రజలకు సైతం అందుబాటలోకి రావడంతో భారతదేశంలో ఎన్నికల వేళ సోషల్ మీడియా ఎంతటి ప్రభావం చూపిస్తుందో ఇప్పటికే అర్థమవుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube