టీవీలో వాట్సాప్ : సంతోషాలను పంచుకోండి.. ఫుకార్లను కాదు !

యూజర్ల ఆదరణతో… దూసుకుపోతున్న వాట్సాప్ ఇప్పుడు టీవీలో కనిపించబోతోంది .ఇది నిజంగా ఒక విచిత్రమే అయినా … తప్పనిసరి పరిస్థితుల్లో వాట్సాప్ టీవీలోకి వస్తోంది.

 Whatsapp Starting Tv Adds For Fake News Control-TeluguStop.com

ఇప్పటిదాకా వాట్సాప్ లో నకిలీ ప్రచారాలను ఆపాడంటూ పత్రికల్లో, రేడియోల్లో ప్రకటనలు ఇస్తున్న వాట్సాప్ తాజాగా టీవీల్లోనూ ప్రచారం చేపట్టేందుకు సిద్ధం అయ్యింది.సోషల్ మీడియాలో నకిలీ వార్తల కారణంగా దేశవ్యాప్తంగా పలుచోట్ల మూకదాడులు జరిగి చాలా మంది ప్రాణాలు కొల్పొయారు.

ఈ ఘటనలపై సీరియస్ అయిన కేంద్రం సోషల్ మీడియా సంస్థలను గట్టిగా హెచ్చరించింది.నకిలీ వార్తలు, సందేశాలను అరికట్టాలని సూచించింది.

ఇందులో భాగంగా వాట్సాప్ ప్రకటనల ద్వారా ప్రచారం మొదలుపెట్టింది.

60 సెకన్ల నిడివితో ఈ యాడ్ లో వాట్సాప్ లో నకిలీ వార్తలు, సందేశాలు చూసే బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందనే సందేశాన్ని ఇచ్చింది.దీనిలో భాగంగా ‘సంతోషాలను పంచుకోండి.ఫుకార్లను కాదు’ అనే ట్యాగ్ లైన్ తో వీటిని విడుదల చేశారు.

ఇండియా లో చాలామంది యూజర్లను సంప్రదించిన అనంతరం వారి అనుభవాల ఆధారంగా మూడు యాడ్స్ ను రూపొందించినట్లు వాట్సాప్ నిర్వాహాకులు చెబుతున్నారు.ప్రస్తుతం ఆంగ్లం, తెలుగు, హిందీ, బెంగాలీ, కన్నడ, గుజరాతీ, అస్సామీ, మలయాళీ, మరాఠి భాషల్లో ఈ యాడ్ లను ప్రదర్శించనున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube