వాట్సాప్ ప్రైవసీ పాలసీపై సరికొత్త ప్రచారం...?

ఇన్స్టెంట్ మెసేజింగ్ యాప్ వాట్సప్ ఎప్పటికప్పుడు వారి కస్టమర్స్ కోసం అప్డేట్స్ ను ప్రవేశపెడుతూ ఉన్న సంగతి అందరికి తెలిసిందే.ఈ తరుణంలో ఈ ఏడాది ప్రారంభంలో కొత్త ప్రైవేట్ పాలసీ పేరుతో అనేక సమస్యలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే.

 Whatsapp Privacy Policy,whatsapp , New Rules, After 3 Months, Privacy Police, Wh-TeluguStop.com

తాజాగా భారతదేశంలో సరికొత్త ప్రచారంతో కొత్త ప్రైవసీ పాలసీని అమలు చేయడానికి సిద్ధం అవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.కొత్త ప్రైవసీ పాలసీ మార్పులను చదవడానికి, వినియోగదారులు అంగీకరించడానికి తగినంత సమయాన్ని ఇచ్చేందుకు సంస్థ సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది.

వాట్సప్ సరికొత్త ప్రచారంలో భాగంగా చిన్న బ్యానర్ గా ఉంటుందని అది చాట్ లిస్ట్ పై వినియోగదారులకు కనిపిస్తుందని.ఆ చాట్ లిస్ట్ పై టాప్ టు రివ్యూ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే కొత్త పాలసీకి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చని సంస్థ పేర్కొంటుంది.

అంతేకాకుండా వాట్సాప్ వినియోగదారులు ఈ పాలసీని మే 15 లోపు యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుందని సంస్థ పేర్కొంటుంది.వాస్తవానికి ఈ కొత్త పాలసీ ఫిబ్రవరి 8 నుంచి అమలు చేయాలని మొదట భావించిన వాట్సప్.

ప్రైవేట్ పాలసీ విధానంపై భారతదేశంలో అనేక వివాదాలు రావడంతో కాస్త అమలుచేసేందుకు వెనక్కి తగ్గింది.అప్పటిలో ఈ ప్రైవేటు పాలసీ వినియోగదారుల భద్రతను దెబ్బతీసే ఈ విధంగా ఉన్నట్లు పలు విమర్శలు కూడా వచ్చాయి.

అంతేకాకుండా ఈ క్రమంలో అతి తక్కువ సమయంలోనే సిగ్నల్, టెలిగ్రామ్ యాప్ లు డౌన్లోడ్ కూడా విపరీతంగా పెరిగి ఒక్కసారిగా వాట్సప్ కు షాక్ ఇచ్చాయి.దీంతో వాట్సాప్ ప్రైవేట్ పాలసీ నిబంధనలు మార్చుకొని, వినియోగదారులకు ఈ  విధానాన్ని వివరించాలని నిర్ణయం తీసుకొని, వినియోగదారులకు భద్రత పరంగా ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా ఉండేందుకు ఒక ప్రకటన కూడా విడుదల చేసింది.

మొత్తానికి కొత్త ప్రైవేట్ పాలసీని మూడు నెలలు తర్వాతనే అమలు చేస్తున్నట్లు వాట్సాప్ సంస్థ పేర్కొంది.ఇక చూడాలి మరి ఎప్పటినుంచి ఈ ప్రైవేట్ పాలసీ అమలు అవుతుందో మరి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube