వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్.. మరోసారి వాట్సాప్ పే అందుబాటులోకి..!

తాజాగా మరోసారి భారతదేశ ప్రభుత్వం వాట్సాప్ పే సేవలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.ప్రముఖ మెసేజ్ యాప్ వాట్సప్ కు ది నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుండి అనుమతి లభించింది.

 Whatsapp Pay Is Now Available For Users In India, Whatsapp, Upi Payments, New Up-TeluguStop.com

ఇకపై వాట్సాప్ నుండి యూజర్స్ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ ఫేస్ చెల్లింపులకు అనుమతిని ఇచ్చింది.ఫేస్బుక్ సంస్థ వాట్సాప్ ను కొనుగోలు చేశాక వారి యూజర్స్ కోసం ఎప్పుడూ ఏదో ఒక అప్డేట్ తీసుకు వస్తూనే ఉంది.

భారతదేశంలో వాట్సాప్ కు ఎన్‌‌పీసీఐ అనుమతిని తీసుకుంది.

చాలా కాలం నుండి పేమెంట్ సేవలను వాట్సాప్ భారత దేశంలో తీసుకురావాలని ప్రయత్నిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.

దీనికోసం ఇప్పటికే హెచ్డిఎఫ్సి బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకు, ఐసిఐసిఐ బ్యాంకు తో కలిసి బీటా టెస్ట్ ను మొదలు పెట్టింది వాట్సాప్.ఇందుకు సంబంధించి వాట్సాప్ అందరి యూజర్లకు పేమెంట్ సేవలు అందించేందుకు ప్రభుత్వంతో కలిసి పని చేస్తున్నట్లు వాట్సప్ అధికార వర్గం తెలిపింది.


Telugu Upi, Whatsapp-Latest News - Telugu

వాట్సాప్ లో అతి త్వరలో పేమెంట్ సేవలు మొదలవుతాయని దానితో భారతదేశంలో డిజిటల్ సేవలు మరింత ఊపందుకుంటాయని వాట్సప్ అధికారులు తెలిపారు.కరోనా వైరస్ తీవ్రత భావంతో ఉన్న పరిస్థితుల్లో భారతదేశంలోని 40 కోట్ల మందికి పైగా వాట్సప్ యూజర్లు సురక్షితంగా లావాదేవీలు జరిపేందుకు ఎంతగానో సహాయ పడుతుందని వాట్సాప్ ప్రతినిధులు తెలుపుతున్నారు.ఇదివరకు వాట్సాప్ పేమెంట్ సేవలను నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 2018 ఫిబ్రవరి లో నిలిపివేసిన సంగతి మనకు తెలిసిందే.చట్టపరమైన రూల్స్ అలాగే నియంత్రణ అడ్డంకుల కారణంగా వాటిని పునరుద్ధరించేందుకు ఏకంగా రెండు సంవత్సరాల సమయం పట్టింది.

ఇప్పుడు మొత్తానికి వాట్సాప్ డిజిటల్ సేవలు అందించడానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube