వాట్సప్‌ మరింత సులభం, మరింత సెక్యూరిటీ.. ఈ రెండు కొత్త ఫీచర్స్‌ తప్పక తెలుసుకోండి  

Whatsapp Now Very Easy And Secure With Fingerprint Scanning-whatsapp Fingerprint Scanning,whatsapp New Futures,whatsapp Now Very Easy And Secure

ప్రపంచ వ్యాప్తంగా 100 కోట్లకు పైగా ఖాతాదారులను చేర్చుకున్న వాట్సప్‌ ఎప్పటికప్పుడు కొత్త పీచర్స్‌ను తీసుకు వస్తూనే ఉంది. అద్బుతమైన పీచర్స్‌తో వాట్సప్‌ కొత్త హంగులు పలుముకుంటూనే ఉంది. ఒకప్పుడు కేవలం సందేహాలు మరియు ఫొటోలు మాత్రమే పంచుకునే విధంగా ఉండేది. ఆ తర్వాత వాయిస్‌ కాల్‌ను తీసుకు వచ్చిన వాట్సప్‌, వీడియో కాలింగ్‌ను కూడా అందుబాటులోకి తీసుకు వచ్చింది..

వాట్సప్‌ మరింత సులభం, మరింత సెక్యూరిటీ.. ఈ రెండు కొత్త ఫీచర్స్‌ తప్పక తెలుసుకోండి-WhatsApp Now Very Easy And Secure With Fingerprint Scanning

ఆ తర్వాత మరిన్ని ఫీచర్స్‌తో వాట్సప్‌ వినియోగదారులను తన బానిసలుగా చేసుకుంది.

చేతిలో స్మార్ట్‌ ఫోన్‌ ఉంటే అందులో వాట్సప్‌ లేకుండా ఉండదు. ప్రపంచలో అత్యంత ఎక్కువ మంది వినియోగిస్తున్న మెసెంజర్‌గా వాట్సప్‌ నిలిచింది. అందుకే వాట్సప్‌ తన వినియోగదారులకు సరికొత్త అనుభవంను ఇవ్వడంతో పాటు, తమ వినియోగదారుల డేటాను అత్యంత సెక్యూరిటీతో ఉంచాలని భావిస్తుంది.

తాజాగా వాట్సప్‌ తీసుకు వచ్చిన రెండు కొత్త ఫీచర్స్‌ ప్రస్తుతం వాట్సప్‌ను జనాల్లోకి మరింత దగ్గర చేస్తున్నాయి. ఈ రెంటితో వాట్సప్‌ను ఇకపై ఎవరైనా వాడవచ్చు, అదే సమయంలో డేటాకు చాలా సెక్యూరిటీ ఉంటుంది..

వాట్సప్‌ భాష మార్చుకునే విధంగాను తీసుకు వచ్చింది. స్థానిక బాషలు దాదాపు 40 కొత్తగా చేరాయి. అందులో తెలుగు కూడా ఉండటం విశేషం.

తెలుగు భాషలో వాట్సప్‌ బాషను ఎంపిక చేసుకుంటూ చాలా సులభంగా, పెద్దగా చదువుకోని వారికి కూడా అర్థం అయ్యేలా వాట్సప్‌ ఉంటుంది. ఇక వాట్సప్‌ యాప్‌ ఓపెన్‌ చేసేందుకు ఫింగర్‌ ప్రింట్‌ తప్పనిసరి చేయబోతున్నారు. పింగర్‌ ఫ్రింట్‌ ఉన్న ఫోన్‌లకు ఇప్పటికే ఆ అవకాశం తీసుకు వచ్చారు..

త్వరలోనే ఆండ్రాయిడ్‌ ఫుల్‌ వర్షన్‌లో ఈ ఫీచర్‌ను తీసుకు వచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. మొత్తానికి వాట్సప్‌ వినియోగదారులు సర్‌ప్రైజ్‌ అయ్యేలా కొత్త కొత్త ఫీచర్స్‌ వస్తూనే ఉన్నాయి.