వారి కోసం వాట్సాప్ కొత్త లాగవుట్ ఫీచర్..! పూర్తి వివరాలు ఇలా..!

నేటి సమాజంలో చాల మంది వాట్సప్ గురించి తెలియని వారంటూ ఉండరు.చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరు వాట్సప్ వాడుతున్నారు.

 Whatsapp New Log Out Features Here Are The Details, Logout Option, Ios Operating-TeluguStop.com

ఈ వాట్సప్ వాడుకలో వచ్చిన దగ్గరి నుండి చాల ఫీచర్లను తీసుకొచ్చారు.అలకచెందిన వినియోగదారులను తిరిగి ఆకట్టుకోవడానికి ప్రయత్నాలు మొదలుపెట్టింది వాట్సాప్‌.

ఇందులో భాగంగానే కొత్త ఫీచర్‌ల గురించి ఆలోచిస్తుంది.వాట్సాప్ యూజర్స్‌ ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న మల్టీ డివైజ్‌ సపోర్ట్ ఫీచర్ ను ఇప్పటికే ఆండ్రాయిడ్ యూజర్లకి‌ బీటా వెర్షన్ అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే.

ఇక తాజాగా ఐఓఎస్‌ యూజర్స్‌కి కూడా బీటా వెర్షన్‌ను విడుదల చేసినట్లు వాట్సాప్‌ కమ్యూనిటీ బ్లాగ్ వాట్సాప్‌ బీటా ఇన్ఫో తెలిపింది.ఈ ఫీచర్ ద్వారా యూజర్స్‌ వాట్సాప్‌ ఖాతా ఉపయోగిస్తున్న ఫోన్ పనిచేయకపోయినా మరో ఫోన్‌లో వాట్సాప్‌ యాక్సె‌స్‌ చేసుకోవచ్చు.

అలానే వేర్వేరు డివైజ్‌లలో ఒకేసారి వాట్సాప్‌ను కనెక్ట్‌ చెయ్యొచ్చు.దీనితో పాటు వాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్‌ కూడా తీసుకొస్తున్నారు.ప్రస్తుతం ఉన్న డిలీట్ మై అకౌంట్ స్థానంలో కొత్తగా లాగౌట్ అనే ఫీచర్‌ తీసుకొనివస్తున్నారు.

Telugu Beta, Ios System, Logout, Vidoeos, Whatsapp Logout, Whatsapp-Latest News

ఈ ఫీచర్ వలన వినియోగదారులు వేరే పరికరాలలో వాట్సాప్‌ లాగౌట్ చేయడం మర్చిపోతే ఈ ఫీచర్‌ తో ఎక్కడి నుంచైనా లాగౌట్‌ చేయవచ్చు.దీనికి సంబందించిన ఒక వీడియోను వాట్సాప్ తన బ్లాగ్ లో షేర్ చేసింది.అలాగే మ్యూట్‌ ఫీచర్ ను‌ తీసుకోని వస్తుంది.

వేరే యూజర్లకు వీడియో, క్లిప్‌ను పంపించడానికి ముందు మ్యూట్‌ చేసి పంపవచ్చు.ప్రస్తుతం పరీక్షదశలో ఉన్న ఈ ఫీచర్‌తో వీడియో ఎడిట్, టెక్స్ట్ ఎడిట్, ఇమోజీ మొదలైనవి చేయవచ్చు.

ఈ ఏడాది మొదట్లో వాట్సాప్ ప్రైవసీ పాలసీ పేరిట సరికొత్త నిబంధనలు తీసుకొచ్చి ఇబ్బందులు పడిన సంగతి మనకు తెలిసిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube