వాట్సాప్ తన వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్ ను తీసుకవస్తు వారిని సప్రైజ్ చేస్తూ ఉంటుంది.తాజాగా మరో రెండు సదుపాయాలన్ని కూడా వినియోగదారులకి తీసుకు వచ్చింది.
అయితే ఇది కేవలం వాట్సాప్ బిజినెస్ అప్లికేషన్ ద్వారా నే పని చేస్తోంది.వాట్సాప్ బిజినెస్ అప్లికేషన్ లో వివిధ వ్యాపార సంస్థలు తమ కస్టమర్లతో సంప్రదింపులు చేసే సమయంలో కాస్త వెసులుబాటు కల్పించింది కూడా.
ఇందుకోసం మామూలుగా ఇప్పటివరకు వినియోగదారుల కొరకు కేవలం ఆయా సంస్థలకు సంబంధించి వారి ఫోన్ నెంబర్లను ఫోన్ బుక్ లో సేవ్ చేసుకొని ఉంటే మాత్రమే వారికి మెసేజ్ పంపడానికి సులువుగా ఉండేది.ఇకపోతే తాజాగా ఇటువంటి శ్రమ వాట్సాప్ సంస్థ వినియోగదారులకు లేకుండా చేస్తోంది.
ఇందుకోసం ఓ కొత్త ఏర్పాటును కూడా తీసుకు వస్తోంది.
ఇప్పుడు వరకు ఏదైనా కొనుగోలు చేయడానికి వెళ్ళినప్పుడు కానీ, ఏదైనా వ్యాపార సంస్థకు సంబంధించి నటువంటి బ్రోచర్ పొందినప్పుడు గాని, అలాగే సదరు వ్యాపార సంస్థ ఇచ్చే బిల్లింగ్ రిసిప్ట్ ను తీసుకున్నప్పుడు గాని, ఇలా వారు ఇచ్చే ప్యాకింగ్ మీద గాని… ఆ వ్యాపార సంస్థ పొందుపరిస్తే దీనికి పరిష్కారం చాలా సులువుగా మారింది.
వినియోగదారుడు ప్రత్యేకంగా సదరు వ్యాపార సంస్థకు సంబంధించిన ఫోన్ నెంబర్ సేవ్ చేసుకో పోయిన సరే ద్వారా స్కాన్ చేస్తే కంటిన్యూ చాట్ అనే ఆప్షన్ వారికి ప్రత్యక్షమవుతుంది.అంతే అక్కడి నుంచి వారు వారితో వాట్సాప్ ద్వారా చాటింగ్ చేసుకోవచ్చు.

దీంతో పాటు మరో సదుపాయాన్ని కూడా వాట్సాప్ తీసుకువచ్చింది.ఇది కూడా వ్యాపార సంస్థలకు పనికి వచ్చే విధంగా మాత్రమే ఉంది.ఇందులో కూడా ఏదైనా సంస్థ వారికి సంబంధించిన వస్తువులను గాని, ఉత్పత్తుల గాని, సైట్ లింకులు అలాగే వారి ఫేస్ బుక్ ఇంస్టాగ్రామ్ సంబంధించి అకౌంట్ ఫాలో అవ్వడానికి సంబంధిత సమాచారాన్ని క్యూఆర్ కోడ్ ద్వారా కస్టమర్లకు చేరవచ్చు.