వాట్సాప్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. సరికొత్త ఫీచర్లు!

వాట్సాప్.ప్రస్తుతం 12 ఏళ్ళ వయసు పిల్లల నుంచి 70 ఏళ్ల వృద్ధుల వరకు ప్రతి ఒక్కరికి ఇది నిత్యావసరం.

 New Features Added In Whatsapp, Whatsapp, New Features, Payments, 138 New Emojis-TeluguStop.com

ఈ యాప్ లేకపోతే ఇప్పుడు ఎన్నో పనులు ఆగిపోతాయ్ అనడంలో ఎలాంటి సందేహం లేదు.అంత ప్రాముఖ్యత ఈ యాప్ కి ఉంది.

ఇక అలా ఎన్నో కోట్లమంది వినియోగిస్తున్న ఈ వాట్సాప్ ను సరికొత్తగా చెయ్యడంలో వాట్సాప్ కూడా ముందుంటుంది.ఎన్నో సరికొత్త ఫీచర్స్ అందుబాటులోకి తీసుకొచ్చి అందరిని మెప్పిస్తుంది వాట్సాప్.

ఇక ఇప్పుడు కూడా అలానే ఓ సరికొత్త ఫీచర్ ను వినియోగదారుల ముందుకు తీసుకొచ్చింది. మ్యూట్‌ బటన్‌, న్యూ ఐకాన్స్‌, కేటలాగ్‌ షార్ట్‌కట్‌, లెక్కలేనన్ని ఎమోజీలను వినియోగదారుల ముందుకు తీసుకొచ్చింది.

అయితే ఇందులో పొందుపరిచినా కొన్ని ఆప్షన్లు బీటా వెర్షన్లకే పరిమితం అవ్వగా మిగిలినవి నార్మల్‌ యూజర్లకూ కూడా అందిస్తుంది.ఇక అందులో మ్యూట్ బటన్ గురించి మనకు తెలిసిందే.

కొందరి మెసేజ్ లకు రిప్లై ఇవ్వలేక అలానే మాట్లాడలేక మ్యూట్ అనే బటన్ ను పెడుతుంటారు.ఇన్నాళ్లు అది కేవలం 8 గంటలు, వారం, సంవ్సతరం ఉండగా ఇప్పుడు ఫరెవర్ అనే కొత్త ఆప్షన్ వినియోగదారుల ముందుకు వచ్చింది.

ఇక అలానే సరికొత్తగా 138 ఎమోజిలను తీసుకొచ్చింది.అందులో ముఖ్యంగా చెఫ్‌, ఫార్మర్‌, పెయింటర్‌, వీల్‌ చెయిర్‌ వంటి అద్భుతమైన ఎమోజిలను వినియోగదారుల ముందుకు తీసుకొచ్చింది.ఇక కొత్తగా వాట్సాప్ నుంచి పేమెంట్ చేసేలా‌ ఒక ఫీచర్, సరికొత్తగా ఫ్రెండ్స్ తో మాట్లాడేకి రూమ్ ఫీచర్ ని అందుబాటులోకి తెచ్చింది.ఇంకా బిజినెస్ వాట్సాప్ యూజర్ల కోసం కేటలాగ్‌ షార్ట్‌కట్‌ ఫీచర్‌ను తీసుకొచ్చారు.

ఇక అలానే మిమ్ క్రియెట్స్ చేసేలా ఫోటో, వీడియో సెండ్ చేసే సమయంలో ఎడిట్ చేసేలా ఎన్నో అద్భుతమైన ఫీచర్లను సరికొత్తగా అందిస్తుంది వాట్సాప్.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube