వాట్సాప్ పేమెంట్స్ లో స్టిక్కర్స్ ఫీచర్.. !!

ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా వాట్సాప్ ను విపరీతంగా ఉపయోగిస్తున్నారు.అలాగే వాట్సాప్ కూడా తన వినియోగదారులను ఎప్పటికప్పుడు ఆకర్షించడానికి కొత్త కొత్త ఫీచర్లను జోడిస్తూ వస్తుంది.

 Whatsapp New Feature With Stickers In The Payments Feature, What's Up, Payment,-TeluguStop.com

ఈ క్రమంలోనే వాట్సాప్ ఈ మధ్య కాలంలో పేమెంట్​ మోడ్​ అనే సరికొత్త ఫీచర్​ను జోడించింది.అయితే మీరు ఎవరికైనా పేమెంట్​ చేసేటప్పుడు ఆ పేమెంట్​ నేపథ్యాన్ని స్టిక్కర్​ రూపంలో వేరే వ్యక్తికి తెలియజేయవచ్చు అన్నమాట.

భాషతో సంబంధం లేకుండా కేవలం స్టిక్కర్స్ రూపంలో మీరు చెప్పాలనుకుంటున్న విషయాన్ని అవతలి వ్యక్తికి ఈ స్టిక్కర్ల రూపంలో తెలియచేయవచ్చు అన్నమాట.

ఈ నేపథ్యంలో ఈ స్టిక్కర్​ ప్యాక్​ల గురించి వాట్సాప్ ఇండియా పేమెంట్స్ డైరెక్టర్ మనేష్ మహాత్మే మాట్లాడుతూ ఇలా చెప్పుకొచ్చారు.

మీరు చేసే ప్రతి చెల్లింపు వెనుక ఒక స్టోరీ దాగి ఉంటుంది కదా.అందుకే మీరు చేసే చెల్లింపు వెనుక ఉన్న కథను ఇలా స్టిక్కర్​ రూపంలో అవతలి వ్యక్తికి తెలియజేసేందుకు.ఈ సరికొత్త ఫీచర్​ను మీ ముందుకు తీసుకుని వచ్చామని తెలిపారు.ఈ నూతన ఫీచర్​తో వాట్సాప్ డిజిటల్​ పేమెంట్లు పెరుగుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేసారు.డిజిటల్​ పేమెంట్​ వ్యవస్థలో 500 మిలియన్ల మార్కును చేరుకునే లక్ష్యంగా తాము ఐదుగురు నైపుణ్యం కలిగిన మహిళా కళాకారులతో ఒప్పందం చేసుకున్నామని చెప్పారు.

మరి ఆ ఐదుగురు మహిళా కళాకారులు ఎవరు, ఏంటి అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Telugu Anjali Mehetha, Latest, Latest Ups, Meerafesilia, Neeti, Ups, Stickers, S

వారిలో అంజలి మెహతా కూడా ఒకరు.ఈమె దేశంలోనే పేరొందిన హ్యూమన్స్​ సైకాలజిస్ట్​.ఆమె ఇప్పటికే ఎన్నో చిత్రాలను గీశారు.తన ఫోటోగ్రఫీతో ఎంతో మందిని ఆకట్టుకున్నారు.అలాగే మరొక కళాకారిణి అనుజా పోతిరెడ్డి. ఈమె కూడా దేశంలోనే పేరొందిన స్కెచ్ ఆర్టిస్ట్, జిఫ్​ క్యూరేటర్.

ఆమె వాట్సాప్ ప్యాక్​లు ‘పే ఓకే ప్లీజ్​’ పేరుతో అందుబాటులో ఉన్నాయి.ఒషీన్​ సిల్వా భారతీయ ఉత్తమ చిత్రకారుల్లో ఒకరు.

ఈవిడ స్పెషాలిటీ ఏంటంటే ఫిక్షన్ లెన్స్ ద్వారా చిత్రాలను బాగా గీస్తారు. ‘సబ్సే బడా రూపాయ్​’ పేరుతో ఆమె స్టిక్కర్​ ప్యాక్​లు అందుబాటులో ఉన్నాయి.

Telugu Anjali Mehetha, Latest, Latest Ups, Meerafesilia, Neeti, Ups, Stickers, S

అలాగే నీతి కూడా మంచి కళాకారిణి.డ్రీమ్స్​ చిత్రాలు, జీవిత సత్యాలు గీయడంలో ఆమె దిట్ట.ఆమె స్టిక్కర్ ప్యాక్​లు ‘పే ఆధా లేదా జ్యాదా’ పేరుతో అందుబాటులో ఉన్నాయి.ముంబై కి చెందిన మీరా ఫెలిసియా మల్హోత్రా ఒక ఫేమస్​ గ్రాఫిక్ డిజైనర్.

ఆమె స్టిక్కర్​ ప్యాక్​లు ‘అప్నా సప్నా మనీ’ పేరిట అందుబాటులో ఉన్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube