వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్.. ఆ కష్టాలకు చెక్..!  

whatsapp officially rolls out always mute option in group chats, Whatsapp, Always Mute Option, Whatsapp Update, New Features in Whatsapp,Iphone users - Telugu Always Mute Option, Iphone Users, New Features In Whatsapp, Whatsapp, Whatsapp New Feature, Whatsapp Officially Rolls Out Always Mute Option In Group Chats, Whatsapp Update

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ వినియోగదారులకు శుభవార్త చెప్పింది. గ్రూప్ చాట్స్ వల్ల విసిగిపోయిన కస్టమర్ల కోసం “ఆల్వేస్ మ్యూట్ ” అనే కొత్త ఆప్షన్ ను అందుబాటులోకి తెచ్చింది.

TeluguStop.com - Whatsapp New Feature Always Mute

ఒకటి, రెండు కంటే ఎక్కువ వాట్సాప్ గ్రూప్స్ లో ఉండే వాళ్లు తరచూ వచ్చే నోటిఫికేషన్ల వల్ల ఇబ్బందులు పడుతున్నారు.వాట్సాప్ గ్రూపుల్లో మనకు అనవసరమైన మెసేజ్ లు, వీడియోలు, ఫోటోలు ఎక్కువగా వస్తుంటాయి.
ఆల్వేస్ మ్యూట్ అనే ఆప్షన్ ద్వారా గ్రూప్ చాట్ లను మ్యూట్ చేసే అవకాశం కల్పిస్తోంది.వాట్సాప్ ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఈ కొత్త ఫీచర్ కు సంబంధించిన విషయాలను, విశేషాలను ప్రకటించింది.

మన అవసరాలకు అనుగుణంగా గ్రూప్ చాట్ లను మ్యూట్ లేదా అన్ మ్యూట్ చేయవచ్చు.ఇప్పటివరకు 8 గంటలు, వారం, ఏడాది మ్యూట్ చేసుకునే అవకాశం ఉండగా ఏడాది మ్యూట్ అనే ఆప్షన్ ను తొలగించి అల్వేస్ మ్యూట్ అనే ఆప్షన్ ను అందుబాటులోకి తెచ్చింది.

TeluguStop.com - వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్.. ఆ కష్టాలకు చెక్..-General-Telugu-Telugu Tollywood Photo Image

వాట్సాప్ కొత్త ఫీచర్ ఆండ్రాయిడ్ ఫోన్ యూజర్లతో పాటు యాపిల్ ఫోన్ యూజర్లకు సైతం అందుబాటులోకి వచ్చింది.పర్మినెంట్ గా మ్యూట్ చేసే సదుపాయం కావడంతో వాట్సాప్ యూజర్లకు ఒక పెద్ద సమస్య తీరినట్లేనని చెప్పవచ్చు.స్మార్ట్ ఫోన్లతో పాటు వాట్సాప్ వెబ్ లోనూ ఈ ఆప్షన్ ను వినియోగించుకోవచ్చు.మొదట బీటా వెర్షన్ లో వాట్సాప్ ఈ ఫీచర్ ను అందుబాటులోకి తెచ్చింది.
మీరు వాట్సాప్ యూజర్లు ఐతే యాప్ లో ఈ ఫీచర్ అందుబాటులో వచ్చిందో లేదో చెక్ చేసుకోవచ్చు.ఒకవేళ ఫీచర్ అందుబాటులో లేకపోతే మాత్రం యాప్ ను అప్ డేట్ చేసుకోవాల్సి ఉంటుంది.

వాట్సాప్ తీసుకొస్తున్న కొత్త ఫీచర్లు తమను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయని వినియోగదారులు అభిప్రాయపడుతున్నారు.

#NewFeatures #WhatsappNew #Whatsapp Update #Whatsapp #Iphone Users

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Whatsapp New Feature Always Mute Related Telugu News,Photos/Pics,Images..