ఆహా ... వాట్సాప్ నుంచి మరో కొత్త ఫీచర్ !

ప్రస్తుతం ఉన్న జెనరేషన్ అంతా ఎప్పటికప్పుడు కొత్తదనం కోరుకుంటున్నారు.రొటీన్ గా ఉండే యాప్స్ కి పెద్ద ఆదరణ ఉండదు.

 Whatsapp Launch Forward Preview Feature-TeluguStop.com

అందుకే వాట్సాప్ కూడా ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్స్ ని ప్రవేశపెడుతూ.తమ వినియోగదారుల నుంచి ప్రశంసలు పొందుతోంది.తాజాగా… మరో ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది.వాట్సాప్‌ నుండి పంపే మెసేజ్‌లను మరోసారి చూసుకునేందుకు వీలుగా ‘ప్రివ్యూ’ ఆప్షన్‌ త్వరలో ప్రవేశపెట్టేందుకు వాట్సాప్ ప్రయత్నాలు చేస్తోంది.

ప్రివ్యూ ఆప్షన్‌ ద్వారా వాట్సాప్‌ వినియోగదారులు ఓ మెసేజ్‌ను ఫార్వర్డ్‌ చేసే ముందే దాని ప్రివ్యూ చూసుకోవచ్చు.అంటే.మెసేజ్‌, ఫొటో, వీడియోలు వంటి వాటిని అవతలి వారికి పంపే ముందు మరోసారి సరిచూసుకోవచ్చు.అంతేకాదు ఆ మెసేజ్‌లను సెండ్ చేయడం లేదా డిలీట్ చేయడం చేసుకోవచ్చు.

మెసేజ్‌ ప్రివ్యూ సమయంలోనే.ఫార్వర్డ్‌ మెసేజ్‌ల జాబితాలో మరికొంత మందిని ఎంపిక చేసుకోవచ్చు లేదా ఉన్నవారిలో ఎవరినైనా తొలగించవచ్చు.

ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మందికి ఫార్వర్డ్‌ చేయాలనుకున్నప్పుడు మాత్రమే ఈ ప్రివ్యూ ఆప్షన్‌ ఉపయోగపడుతుందట.ప్రస్తుతం టెస్టింగ్‌ దశలో ఉన్న ఈ ఫీచర్‌ను త్వరలో అందుబాటులోకి రానుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube