తాము ఎలాంటి ప్రశ్నలు ఎదుర్కోవడానికైనా సిద్ధమంటున్న వాట్సాప్..!

ఎప్పుడైతే వాట్సాప్ కొత్త ప్రైవసీ పాలసీని తీసుకవచ్చిందో అప్పటినుంచి నానా రచ్చ సోషల్ మీడియాలో జరుగుతోంది.అయితే ఇలా జరగడానికి కారణం లేకపోలేదు.

 Whatsapp Is Ready To Face Any Questions, Whatsup App, Privacy Policy, Messageing-TeluguStop.com

వాట్సాప్ తన యూజర్ల వ్యక్తిగత భద్రతా చర్యల కారణంగా వాట్సాప్ వారి వినియోగదారుల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారేచేస్తోందంటూ ఎందరో పెద్ద ఎత్తున గగ్గోలు పెడుతున్నారు.ఇలా కేవలం కామెంట్స్ చేయడం మాత్రమే కాకుండా.

పెద్ద ఎత్తున వాట్సాప్ ను వారి మొబైల్స్ నుండి అన్ఇన్స్టాల్ చేసేస్తున్నారు.వాట్సాప్ కు బదులు వాట్సాప్ లాగా ఉపయోగపడే వివిధ రకాల యాప్స్ ను వినియోగించడం మొదలు పెట్టారు వాట్సప్ వినియోగదారులు.

కొందరు వినియోగదారులు వాట్సప్ తీసుకువచ్చిన కొత్త ప్రైవసీ పాలసీ విధానాలకు ఓకే చెప్పేది లేదంటూ సిగ్నల్, టెలిగ్రామ్ లాంటి యాప్స్ కు వెళ్ళిపోతున్నారు.దీంతో వాట్సాప్ కాస్త నిదానంగా మేల్కొని కొన్ని చర్యలు చేపడుతోంది.

ఇప్పుడిప్పుడే వాట్సాప్ తన ప్రైవసీ పాలసీలపై వినియోగదారులకు క్లారిటీ ఇచ్చే ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది.దీనికోసం ఇదివరకే పలు ప్రకటనలు చేస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తోంది.

ఇదే క్రమంలోనే ఇప్పటికే వాట్సాప్ పలు ప్రకటనలు చేసింది.ఇందులో భాగంగానే తాజాగా మరో వివరణ తెలిపింది.

Telugu Apps, Privacy Policy, Whatsup App, Whatsup-Latest News - Telugu

వాట్సాప్ వారి నూతన ప్రైవసీ పాలసీ లపై ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రశ్నలకైనా సమాధానం ఇస్తామని వాట్సాప్ హెడ్ విల్ చాత్ కార్ట్ పేర్కొన్నారు.తాము యూజర్ల విశ్వాసాన్ని కూడగట్టుకోవడానికి కోసం సిగ్నల్ వంటి ప్రత్యర్థులతో తాము పోటీపడి ముందుకు వెళ్తామని ఆయన చెప్పుకొచ్చారు.తాజా ప్రకటనతో వాట్సప్ సంస్థపై యూజర్ లో నమ్మకం కలుగుతుందో.లేదో, అలాగే ఇతర యాప్స్ జోరు కొనసాగుతోందో వేచిచూడాలి మరి.ఈ మధ్య కాలంలో హ్యాకర్లు ప్రైవసీ దెబ్బతీస్తున్న నేపద్యంలో ఇలాంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube