మీరు నమ్మలేని ఫీచర్స్ తో ముస్తాబవుతున్న వాట్సాప్  

Whatsapp Is Getting These Interesting Updates In 2017 -

ఆన్ లైన్ మెసెజింగ్ ఇండస్ట్రీ రారాజు వాట్సాప్ మరో కొత్త అప్డేట్ తో మన ముందుకి వస్తోంది.ఇకపై మీ స్నేహితుడు ఎక్కడ ఉన్నాడో మీరు తనని అడగవలసిన అవసరం లేదు.

తన ఎక్కడ ఉన్నది వాట్సాప్ చెప్పేస్తుంది మీకు.దీన్నే లైవ్ లొకేషన్ షేరింగ్ అని అంటారు.

WhatsApp Is Getting These Interesting Updates In 2017-General-Telugu-Telugu Tollywood Photo Image

ఆండ్రాయిడ్ 2.399, ఐఓఎస్ 2.3.28 వెర్షన్ లో ఈ ఫీచర్ అందుబాటులోకి రానుంది.ఇలా ఉంటే, మనం ఎక్కడున్నది అందరికి తెలిసిపోతుందిగా, వ్యక్తిగత జీవితానికి భంగం కలిగించే ఈ ఆప్షన్ ఎందుకు అని తిట్టుకోకండి, మీరు అవసరం అనుకుంటే దీన్ని డిసేబుల్ మోడ్ లో పెట్టుకోవచ్చు.అలాగే కేవలం మీ స్నేహితులకే మీ లొకేషన్ తెలిసేలా సెట్టింగ్ పెట్టుకోవచ్చు.

అంతే కాదు, నాలుగొవ ట్యాబ్ పెట్టి, అందులో మీరు ఫేస్ బుక్ మాదిరిగా స్టేటస్/ పోస్ట్ పెట్టే అవకాశం కూడా కల్పించే ఆలోచనలో ఉందట వాట్సాప్.మన స్నేహితులు స్టేటస్ ఛేంజ్ చేస్తే నోటిఫికేషన్‌ రావడం, వాట్సాప్ కి మనం డైరెక్ట్ గా ఫీడ్ బ్యాక్ ఇచ్చే విధంగా కాంటాక్ట్ అస్ ఆప్షన్ తీసుకురావడంపై కసరత్తు చేస్తోంది వాట్సాప్.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Whatsapp Is Getting These Interesting Updates In 2017- Related....