ఫార్వర్డ్ మెసేజ్ లపై లిమిట్ తీసుకొస్తున్న వాట్సాప్.. ఇకపై దానికి చెక్..!

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను పరిచయం చేస్తోంది.ముఖ్యంగా తన మెసేజింగ్ యాప్ వల్ల ఎవరికీ నష్టం వాటిల్లకుండా ఉండేలా మంచి ఫీచర్లను తీసుకొస్తోంది.

 Whatsapp Is Bringing Limit On Forward Messages , Whatsapp , Key Decision , So-TeluguStop.com

ఇందులో భాగంగా ఇప్పటికే ఎన్నో ప్రైవసీ ఫీచర్లను రోల్ అవుట్ చేసింది.అయితే తాజాగా మరొక ఉపయోగకరమైన టెక్నికల్ అప్‌డేట్ తీసుకొచ్చేందుకు వాట్సాప్ సిద్ధమయ్యింది.వాట్సాప్ బీటా ఆండ్రాయిడ్ వెర్షన్ 22.2.7.2, ఐఓఎస్ వెర్షన్ 22.7.0.76లలో ఈ అప్‌డేట్ అందుబాటులోకి వచ్చినట్లు వాట్సాప్ బీటా ఇన్ఫో తెలిపింది.

ఇంతకీ ఆ అప్‌డేట్ ఏంటో తెలుసుకుంటే.

ప్రస్తుతం వాట్సాప్ లో ఒక వ్యక్తి ఒకేసారి ఒక మెసేజ్ ని ఐదుగురు వ్యక్తులకు లేదా ఐదు గ్రూపులకు ఫార్వర్డ్ చేసుకోవచ్చు.కానీ కొత్త అప్‌డేట్ తరువాత యూజర్లు ఒక మెసేజ్ ని ఒకేసారి ఒక గ్రూప్ కి లేదా ఒక వ్యక్తికి మాత్రమే సెండ్ చేయగలరు.

మళ్లీ ఆ మెసేజ్ ని ఫార్వర్డ్ చేయాలి అనుకుంటే.ఈ మెసేజ్ ని సెలెక్ట్ చేసుకొని మళ్లీ ఫార్వర్డ్ చేయాల్సి ఉంటుంది.అలా ఇది చాలా సమయంతో కూడుకున్న పనిలా మారుతుంది.దీనివల్ల అసత్య ప్రచారం వాట్సాప్ ద్వారా వ్యాప్తి చెందే అవకాశం తగ్గుతుంది.

Telugu Beta Android, Ios, Key, Limitforward, Privacy, Forward, Whatsapp-Latest N

ఇప్పటికే వాట్సాప్ సింగిల్ గ్రూప్ ఫార్వర్డ్ లిమిటేషన్ చాలా ఆండ్రాయిడ్ బీటా వెర్షన్లలో రిలీజ్ చేసింది.ప్రస్తుతం వాట్సాప్ రూల్స్ ప్రకారం, యూజర్లు ఐదుగురు వ్యక్తులకు లేదా ఐదు గ్రూపులకు ఒకేసారి మెసేజ్ ఫార్వర్డ్ చేయొచ్చు.వాట్సాప్ బీటా ఇన్ఫో ప్రకారం, కొత్త అప్‌డేట్ తరువాత యూజర్లు వాట్సాప్ మెసేజ్ లను ఒకేసారి ఒకటి కంటే ఎక్కువ గ్రూపులకు లేదా వ్యక్తులకు ఫార్వర్డ్ చేయలేరు.ఇదే జరిగితే, ఒక్క మెసేజ్ ఫార్వర్డ్ చేయడానికి యూజర్లు ప్రతిసారి మెసేజ్ ను సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube