ఫాదర్స్ డే స్పెషల్ గా ' పాప మేరే పాపా' అంటూ కొత్త స్టిక్కర్స్ ను విడుదల చేసిన వాట్సాప్..!

ప్రస్తుత రోజుల్లో చిన్న పిల్లవాడి నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియా వినియోగం సర్వసాధారణం అయిపోయింది.ఈ క్రమంలో సోషల్ మీడియా యప్స్ కూడా వారి కస్టమర్లను ఆకట్టుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉండడం, సరికొత్త ఫీచర్లు ప్రవేశ పెట్టడం మనం చూస్తూనే ఉంటాం.

 Whatsapp Has Released New Stickers Saying Papa Mere Papa As Fathers Day Special-TeluguStop.com

ఇందులో ఎప్పటికప్పుడు వాట్సప్ తన కస్టమర్ల కోసం కొత్త ఫీచర్లను, స్టిక్కర్లను అందిస్తూ ఉండడం, కస్టమర్ లను ఆకట్టుకోవడం జరుగుతుంది.ఇక తాజాగా ఫాదర్స్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసేందుకు “పాపా మేరే పాపా ” అనే పేరుతో సరికొత్త స్టిక్కర్ విడుదల చేసింది వాట్సప్ సంస్థ.

ఈ ఈ కొత్త స్టిక్కర్ ప్యాక్‌ ను ఐఓఎస్, ఆండ్రాయిడ్ యూజర్లకు అందుబాటులోకి తీసుకుని వచ్చినట్లు సమాచారం.స్టిక్కర్స్ ప్యాక్‌ ను ఎవరైనా యూజర్ పొందాలనుకుంటే కేవలం వాట్సాప్ అప్డేట్ చేసుకుంటే సరి.

 Whatsapp Has Released New Stickers Saying Papa Mere Papa As Fathers Day Special-ఫాదర్స్ డే స్పెషల్ గా పాప మేరే పాపా’ అంటూ కొత్త స్టిక్కర్స్ ను విడుదల చేసిన వాట్సాప్..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com
Telugu Fathers Day Spcial, Launches, Papa-mere-papa, Sticker Pack, Whatsapp-Latest News - Telugu

ఈ స్టిక్కర్స్ అన్నీ కూడా ప్రపంచ వ్యాప్తంగా లాంచ్ అయ్యాయని వాట్సాప్ ఫ్యూచర్స్ ట్రాకర్ వారు తెలియజేశారు.ఈ సందర్భంగా ట్విట్టర్ వేదికగా “చెప్పడానికి కష్టంగా అనిపించే కొన్ని విషయాలను తెలియజేసేందుకు ఈ స్టిక్కర్లు సహాయపడతాయని, తండ్రి ప్రేమను గుర్తుచేస్తాయని పేర్కొంది.” అంటూ తెలియచేశారు.వీటితోపాటు లవ్ అండ్ ప్రైడ్ స్టిక్కర్లను కూడా అందుబాటులోకి తీసుకుని వచ్చినట్లు సమాచారం.అయితే ఇటీవల ప్రవేశపెట్టిన వాట్సప్ డిస్‌ అప్పీరియంగ్ మెసేజ్ ఆప్షన్‌ ఫీచర్ ద్వారా 24 గంటల తర్వాత మెసేజ్ లు డిలీట్ అయ్యేలా ప్లాన్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే.వీటితో పాటు వాట్సాప్ యూజర్ల కోసం పలు మార్పులను చేయడం, రివ్యూ వాయిస్ మెసేజ్, మల్టీ డివైజ్ సపోర్ట్, న్యూ ఆర్కివ్ ఫ్యూచర్స అందుబాటులోకి తీసుకొని వచ్చింది.

ఇవి అన్నీ కూడా ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లు అందుబాటులోకి తీసుకొని రాబోతున్నట్లు సమాచారం.ఏది ఏమైనా కానీ ఎప్పటికప్పుడు వాట్సప్ తన కస్టమర్ల కోసం సరికొత్త ఫీచర్లతో ఆకట్టుకోవడం పరిపాటిగా మారిపోయింది.

#Papa-mere-papa #Sticker Pack #Launches #Whatsapp

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు