ఆ విషయంలో మరింత పదిలమైన ఫీచర్ ను తీసుకువచ్చిన వాట్సాప్..!

ప్రముఖ ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సప్ ఇప్పటికే పలు విమర్శలు ఎదుర్కొంటున్న సంగతి అందరికి తెలిసిందే.తాజాగా ముంబై డ్రగ్స్ కేసులో నిందితులు వాట్సప్ బ్యాకప్ ఆటోమేటిక్ గూగుల్ డ్రైవ్ లో సేవ్ అవడం వల్ల ఆ చాట్ పబ్లిక్ లోకి రావడం పట్ల వినియోగదారులకు వాట్సప్ బ్యాకప్ పట్ల ఉన్న నమ్మకం కాస్తా పోయింది.

 Whatsapp Has Brought A More Solid Feature In That Regard . Whats Up, Backup, Goo-TeluguStop.com

ఈ కేసులు పోలీసులు విచారణ చేపట్టిన సంగతి కూడా అందరికీ తెలిసిన విషయమే.

ఈ విషయాన్ని గమనించిన వాట్సప్ సంస్థ తాజాగా ఒక ఫ్యూచర్ ను ప్రవేశపెట్టబోతుంది.

ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్స్ యూజ్ చేస్తున్న వినియోగదారులకు గూగుల్ డ్రైవ్, ఐ ఫోన్ లు యూజ్ చేస్తున్న వారికీ iCloud లో సేవ్ అయ్యే వాట్స్ఆప్ బ్యాకప్ ని నేరుగా యాక్సిస్ చేయకుండా ఉండే విధంగా సంస్థ బ్యాకప్ ను రక్షించే ఫ్యూచర్ ను అందుబాటులోకి తీసుకొని రాబోతుంది.

ఎవరైనా వాట్సాప్ వినియోగదారులు చాట్ బ్యాకప్ పాస్వర్డ్ ప్రొటెక్ట్ చేసుకోవాలని అనుకున్నట్లయితే దాన్ని వెంటనే ఎనేబుల్ చేసుకొని, కనీసం 8 క్యారెక్టర్లతో ఒక పాస్వర్డ్ సెట్ చేసుకోవాల్సి ఉంటుంది.

ఎవరైనా యూజర్స్ కొత్త మొబైల్ ఫోన్లు కానీ, ఇతర సందర్భాల్లో తిరిగి రీస్టోర్ చేసుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడల్లా, ఆ పాస్వర్డ్ ను ఖచ్చితంగా ఎంటర్ చేయాల్సి ఉంటుంది.ఆ పాస్వర్డ్ ను ఎంట్రీ చేసిన తర్వాతనే మొత్తం బ్యాకప్ రీస్టోర్ అయ్యే అవకాశం ఉంది.

ఒక వేళ యూజర్ ఏదైనా తప్పు పాస్వర్డ్ ఎంటర్ చేసే మాత్రం బ్యాకప్ తిరిగి వారి మొబైల్ ఫోన్లకు రాదు.

Telugu Backup, Google Drive, Icould, Password, Safety, Whats-Latest News - Telug

ఇక యూజర్స్ గమనించవలసిన విషయం ఏమిటంటే పాస్వర్డ్ సెట్ చేసుకున్న తర్వాత దాన్ని మళ్ళీ రీసెట్ చేసుకోవడానికి ఎలాంటి ఆప్షన్ కూడా లేదు.ఎవరైనా యూజర్స్ పాస్వర్డ్ సెట్ చేసుకునే సమయంలో చాలా జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాలి.అంతేకాకుండా మరో ముఖ్యమైన విషయం ఏమిటి అంటే వాట్సప్ చాట్ అనేది end-to-end ఎన్క్రిప్షన్ అయినప్పటికీ మాత్రం క్లౌడ్ స్టోరేజ్ లో సేవ్ అయ్యేటప్పుడు మాత్రం ప్లేయింగ్ గానే ఉంటుంది.

ఇలా కొత్తగా పాస్వర్డ్ ప్రొటెక్షన్ సదుపాయం కేవలం డేటా రక్షణ కోసం మాత్రమే అని సంస్థ వాట్సాప్ సంస్థ పేర్కొంటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube