యూజర్లకు వాట్సాప్ గుడ్ న్యూస్.. మరిన్ని మైమరిపించే ఎమోజీలు..

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఇటీవల మెసేజ్ రియాక్షన్స్ అనే సరికొత్త ఫీచర్‌ను లాంచ్ చేసిన సంగతి తెలిసిందే.ఈ ఫీచర్ సాయంతో యూజర్లు తమ భావాలను వ్యక్తీకరించడానికి సపరేట్‌గా ఎమోజీ పంపించాల్సిన అవసరం ఉండదు.

 Whatsapp Good News For Users  More Mesmerizing Emojis  , Whatsapp, Users, Good-TeluguStop.com

జస్ట్, మెసేజ్ పై లాంగ్ ప్రెస్ చేసి తగిన ఎమోజీ ఎంచుకుంటే సరిపోతుంది.అయితే రీసెంట్‌గా అందుబాటులోకి వచ్చిన ఈ ఫీచర్‌లో రెడ్ హార్ట్, థంబ్స్ అప్‌, స్మైలీ, సర్‌ప్రైజ్డ్‌ ఎమోజీ, సాడ్ ఎమోజీ, దణ్ణం ఎమోజీ వంటి 6 ఎమోజీలు మాత్రమే ఉన్నాయి.

వీటితో పాటు మరిన్ని ఎమోజీలు తీసుకొచ్చేందుకు వాట్సాప్ సిద్ధమైంది.తద్వారా యూజర్లు తమ భావాలను వ్యక్తీకరించడానికి తగిన ఎమోజీని సింపుల్‌గా సెలెక్ట్ చేసుకోవచ్చు.

ప్రస్తుతం మరిన్ని ఎమోజీలను తీసుకు వచ్చే పనిలో వాట్సాప్ నిమగ్నం అయిందని వాట్సాప్ ట్రాకర్ వాట్సాప్ బీటా ఇన్ఫో తాజాగా తెలిపింది.ఇది ఒక స్క్రీన్‌షాట్ కూడా షేర్ చేసింది.

ఈ స్క్రీన్‌షాట్‌లో మెసేజ్‌పై లాంగ్ ప్రెస్ చేయగానే కొన్ని ఎమోజీలు, వాటి పక్కనే ‘+’ అనే ఐకాన్ కనిపించింది.ఈ ఐకాన్ పై క్లిక్ చేసిన తర్వాత వాట్సాప్‌లో ఉన్న అన్ని ఎమోజీలు కనిపించాయి.వీటిలో యూజర్లు ఏదంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు.ప్రస్తుతానికి ఈ ఫీచర్ డెవలప్‌మెంట్ స్టేజ్‌లోనే ఉంది.

మొదట ఇది ఐఫోన్‌ యూజర్లకు, ఆ తర్వాత ఆండ్రాయిడ్ యూజర్లకు అందుబాటులోకి రానుంది.ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే యూజర్లు తమకు నచ్చిన ఎమోజీ తో మెసేజ్‌కు రియాక్ట్ అవ్వచ్చు.

మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ స్క్రీన్‌షాట్‌లో సెర్చ్ ఆప్షన్ కూడా కనిపించింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube