వాట్సాప్‌ నుంచి ఈ ఫీచర్‌ అవుట్‌!

ప్రముఖ మెసెంజర్‌ యాప్‌ వాట్సాప్‌ తన ఖాతాలో నుంచి ఓ యాప్‌ను డిలీట్‌ చేయనుంది.స్టోరేజీ ఇష్యూలో భాగంగా ఈ ఫీచర్‌ను తొలగించనున్నట్లు వాట్సాప్‌ తెలిపించి.

 Whatsapp Going To Remove Data Backup Feature-TeluguStop.com

కేవలం ఈ ఒక్క ఫీచర్‌ మాత్రమే కాకుండా కొన్ని రోజులుగా ఇతర ఫీచర్లపై కూడా వర్క్‌ చేస్తోంది.డేటా బ్యాకప్‌ అనే ఫీచర్‌కు ఇక బ్రేక్‌ పడినట్లే.

ఈ యాప్‌ ద్వారా ఇది వరకు మనం డిలీట్‌ చేసిన ఫోటోస్, ఫైల్స్, వీడియోస్‌ను బ్యాకప్‌ చేసుకునే వెసులుబాటు ఉండేది.ఇది వరకు కొత్త ఫోన్‌ కొన్నా.

 Whatsapp Going To Remove Data Backup Feature-వాట్సాప్‌ నుంచి ఈ ఫీచర్‌ అవుట్‌-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

లేదా వాట్సాప్‌ డిలీట్‌ చేసి రీఇన్‌స్టాల్‌ చేయగానే ఛాట్‌ ఆప్షన్‌లో ఉండే బ్యాకప్‌ ద్వారా మళ్లీ పొందుతుండే.క్లౌడ్‌ స్టోరేజీలో ఈ డేటా ఎక్కువతోందని ఇది కేవలం తమ యూజర్ల మేలు కోసమేనని వాట్సాప్‌ చెబుతోంది.

ఇక ఇందులో స్టేటస్‌ సేవ్‌ అయ్యే ఆప్షన్‌ కూడా వాట్సాప్‌లో కనిపించదన్నమాట.

Telugu Backup, Chat Backup, Whatsapp-Latest News - Telugu

అంతేకాదు మల్టీ డివైజ్‌ సపోర్టుపై కూడా వాట్సాప్‌ లైట్‌ తీసుకోనుంది.అంటే ఒక నంబర్‌తో కేవలం ఒక డివైజ్‌ మాత్రమే వాడాల్సి ఉంటుంది.ఇది వరకు మల్టీ డివైజ్‌ సిస్టం ద్వారా ఒకేసారి నాలుగు డివైజ్‌లు వాడే వెసులుబాటు ఉండేది.

దీన్ని చాలా రోజులుగా పరీక్షిస్తున్నారు.ఇప్పటికే అప్డేడ్‌ చేసినా వాట్సాప్‌ బీటా వెర్షన్‌లో స్టేటస్‌ బ్యాకప్‌ ఆప్ష¯Œ ను తొలగించిందంట.

ఇప్పటికే ఐఓఎస్‌ యూజర్లకు కూడా అమల్లోకి తీసుకువచ్చింది.డేటా బ్యాకప్‌ ద్వారా విపరీతంగా స్టోరేజీ వేస్ట్‌ అవుతోంది.

మనం సాధారణంగా తీసే ఇమేజ్, వీడియోలు ఆటోమెటిగ్గా గూగుల్‌ డ్రైవ్‌లో స్టోర్‌ అయిపోతాయి.దీనివల్ల స్టోరేజీ పెరిగి, ఫైల్‌ సైజ్‌ కూడా పెరిగిపోతోంది.

బీటా యూజర్లకు ఈ ఫీచర్‌తో మొబైల్‌ స్టోరేజీ ఫైల్‌ సైజ్‌ తగ్గిపోయింది.ఇటీవల గూగుల్‌ కూడా స్టోరేజీని పరిమితం చేసిన సంగతి తెలిసిందే.

అది ఆఫర్‌ చేసిన జీబీని మించితే అదనపు స్పేస్‌ కోసం ఇక మనం డబ్బులు కట్టాల్సిందే! ఇప్పుడు వాట్సాప్‌ కూడా ఇదే దారిలో వెళ్తోంది.అదనపు ఛార్జీలు వసూలు చేయకున్నా.

యూజర్లకు ఎంతో ఉపయోగకరంగా ఉన్న డేటా బ్యాకప్‌ ఆఫ్షన్‌ను స్టోరేజీ కారణంగానే తొలగించడానికి సిద్ధపడింది.అది కూడా కేవలం వినియోగదారుల వెసులుబాటు కోసమే అని చెప్పడం కొసమెరుపు.

ఇక రానున్న రోజుల్లో ఇంకా ఏ ఫీచర్లపై ప్రయోగాలు చేస్తుందో చూద్దాం.

#Chat Backup #Whatsapp #Backup

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు