వాట్సాప్ లో కొత్త ఫీచర్.. ఇండియన్ యూజర్లకు క్యాష్ బ్యాక్ ఆఫర్..!

ప్రముఖ మేసేజింగ్ అప్లికేషన్ వాట్సాప్ తమ సేవలను భారత్ లో మరింత విస్తరించేందుకు గత ఏడాదిలో పేమెంట్స్ ఫీచర్ను అందుబాటులోకి తీసుకొచ్చిన సంగతి అందరికీ తెలిసిందే.అయితే తాజాగా వినియోగదారులకు కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తెచ్చేందుకు వాట్సాప్ డెవలపర్లు కృషి చేస్తున్నారు.

 Whatsapp Giving Cash Back Offers To Indian Users Doing Payments Through Whatsapp-TeluguStop.com

అందులో వాట్సాప్ ద్వారా పేమెంట్స్ చేసే ఇండియన్ యూజర్లకు క్యాష్ బ్యాక్ ఆఫర్ ను ఇచ్చేందుకు వాట్సాప్ రంగం సిద్ధం చేస్తోంది.

ప్రస్తుతం ఈ ఫీచర్ ప్రయోగదశలో ఉండడంతో త్వరలోనే దీని గురించి అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.ఈ ఫీచర్ వినియోగించి భారతదేశం లోని యూపీఐ పేమెంట్స్ మాత్రమే యూజర్లు చేయగలరని, అది కూడా అందులో రూ.10 క్యాష్ బాక్ ఒక్కసారే పొందగలరని, పేమెంట్స్ చేసిన యూజర్లకు 48 గంటల్లోనే ఆ క్యాష్ బ్యాక్ లభిస్తుందని, ఈ ఫీచర్ అధికారికంగా ప్రకటించిన తర్వాత క్యాష్ బ్యాక్ అమౌంట్, క్యాష్ బ్యాక్ సంఖ్య మారే అవకాశం ఉందని వాబిటా ఇన్ఫో నివేదిక తెలిపింది.

 Whatsapp Giving Cash Back Offers To Indian Users Doing Payments Through Whatsapp-వాట్సాప్ లో కొత్త ఫీచర్.. ఇండియన్ యూజర్లకు క్యాష్ బ్యాక్ ఆఫర్..-Business - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కాగా వాట్సాప్ కమ్యూనిటీ బ్లాగ్ లో వాట్సాప్ చాట్ విండో టాప్ ప్లేసులో కొత్త క్యాష్ బ్యాక్ బ్యానర్ ను వాబిటా ఇన్ఫో నివేదిక ఇప్పటికే ఒక స్క్రీన్ షార్ట్ తీసి పోస్ట్ చేసింది.

Telugu Latest News, New Features, New Updates, Technology Update, Viral Latest, Whatsapp Cash Back Offers, Whatsapp New Features, Whatsapp Updates, Whatsapp Upi Payments Whatsapp Indian Users-General-Telugu

అందులో ” మీ తదుపరి పేమెంట్స్ పై క్యాష్ బ్యాక్ పొందండి అని, ప్రారంభించడానికి బ్యానర్ పై క్లిక్ చేయండి అని ఉంది.అయితే వాట్సాప్ ను ఉపయోగించి మొదటి పేమెంట్స్ చేసే వినియోగదారులు మాత్రమే క్యాష్ బ్యాక్ పొందుతారా.? లేకపోతే గతంలో పేమెంట్స్ జరిపిన యూజర్లకు కూడా ఈ క్యాష్ బ్యాక్ ఆఫర్ వర్తిస్తుందా అనే అంశం పై క్లారిటీ లేదు.

Telugu Latest News, New Features, New Updates, Technology Update, Viral Latest, Whatsapp Cash Back Offers, Whatsapp New Features, Whatsapp Updates, Whatsapp Upi Payments Whatsapp Indian Users-General-Telugu

వాట్సాప్ త్వరలో ఇంకో కొత్త ఫీచర్ని తీసుకురావడానికి సిద్ధ మవుతుంది.గ్రూప్ ఇమేజస్ గా మార్చేందుకు వీలుగా ఎమోజి, స్టికర్ లను ఐకాన్ ఎడిటర్ ఫీచర్ గా తీసుకు రానుంది.ఇవన్నీ టెస్టింగ్ దశలో ఉండడంతో బీటా యూజర్లు కూడా వీటిని యాక్సెస్ చేయలేరు.అయితే వాట్సాప్ లోని మెసెంజర్ రూమ్ లు, ఫేస్ బుక్ లో గ్రూప్ కాల్ లో చేరడానికి 50 మంది యూజర్లను అనుమతించింది.

దీంతో ఈ ఫీచర్ పై సర్వత్రా అసంతృప్తే వ్యక్తం అవ్వడంతో వాట్సాప్ చాట్ షేర్ షీట్ నుంచి ” మెసెంజర్ రూమ్స్” షార్ట్ కట్ ను తొలగించనుంది.అందులో భాగంగానే వాట్సాప్ ఐఓఎస్ బీటా వెర్షన్ 2.21.190.11 లో మెసెంజర్ రూమ్ ఫీచర్ ను తొలగించింది.అలాగే ఆండ్రాయిడ్ బీటా వెర్షన్ 2.21.19.15 కూడా ఈ ఫీచర్ ను తొలగించనుంది.

#Whatsapp Ups #Whatsapp #SappUpi

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు