ప్రస్తుత సమాజంలో వాట్సాప్‌కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు.ఇది ప్రతి మనిషకిఇ చేరువైంది.
ఎంతలా అంటే చదువు రాని వారికి కూడా వాట్సాప్ అంటే తెలిసేంతగా ఇది ఫేమస్ అయిపోయింది.ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరికీ వాట్సాప్ ఉండాల్సిందే.
ఫొటోల దగ్గరి నుంచి మెసేజ్‌ల దాకా వీడియోల నుంచి స్టిక్కర్ల దాక ప్రతి ఒక్కరూ కూడా వాట్సాప్‌నే వాడేస్తుంటారు.ఇక ఇప్పుడ వాట్సాప్‌కొత్తగా ఎన్నో రకాల స్టిక్కర్లను తీసుకొస్తోంది.
ఇప్పుడు కొన్ని ఈవెంట్లకు సంబంధించిన స్టిక్కర్లను కూడా తీసుకొస్తోంది వాట్సాప్.
ఇక ఇప్పుడు రేపు రాబోతున్న రాఖీ పౌర్ణమి సందర్భంగా కొత్త స్టిక్కర్లను తీసుకొస్తోంది వాట్సాప్.
ఇక దీన్ని డౌన్లోడ్ చేసుకొని చెల్లెలు అన్నయ్యకు, అక్కలు తమ్ముళ్లకు పంపించుకోవచ్చు.కాగా ఈ రాఖీ స్టిక్కర్లను అసలు వాట్సాప్‌లోకి ఎలా డౌన్లోడ్ చేసుకోవచ్చో వాటిని ఇతరులకు ఎలా సెండ్ చేయొచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
ఇందుకోసం ఫోన్ లో ఉండే గూగుల్ ప్లే స్టోర్‌కు ముందుగా వెళ్లాల్సి ఉంటుంది.అక్కడకు వెళ్లిన తర్వాత రక్షా బంధన్ వాట్సాప్ స్టిక్కర్లను సెర్చ్ చేస్తే స్టిక్కర్ యాప్‌లు మీకు అక్కడ మెన్షన్ అవుతాయి.

ఇక అలా మెన్షన్ అయిన వాటిల్లో మీకు నచ్చిన రాఖీ స్టిక్కర్లు ఉంటే ఆ యాప్‌ను ఇన్ స్టాల్ చేసుకోవచ్చు.ఆ తర్వాత దాన్ని ఓపెన్ యచేసి మనకు ఇష్టమైన రాఖీ స్టిక్కర్ లను ఎంచుకోవాల్సి ఉంటుంది.ఇక ఆ తర్వాత యాడ్ టు వాట్సాప్ అనే ఆప్షన్ మీద ఎంటర్ చేస్తే సరిపోతుంది.వెంటనే ఆ స్టిక్కర్ ప్యాక్ వాట్సాప్‌లో ఆడ్ అయిపోతుంది.ఇక దాని తర్వాత మీకు కావాల్సిన వారికి రాఖీ స్టిక్కర్ పంపించేందుకు ఎమోజి సింబల్పై క్లిక్ చేయాల్సి ఉంటుంది.ఇక మీరు న్యూ ఇన్‌స్టాల్ చేసిన వాట్సాప్ స్టిక్కర్లు అక్కడ మీకు లిస్ట్ కనిపిస్తుంది.
దాంట్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుని పంపించవచ్చని వాట్సాప్ మేనేజ్ మెంట్ చెపుతోంది.