20 లక్షల ఇండియన్స్ ఖాతాలను బ్లాక్ చేసిన వాట్సాప్... కారణం ఏంటంటే..?

ప్రముఖ మెసేజింగ్ యాప్ అయిన వాట్సాప్ దాదాపు మన ఇండియన్స్ కు సంబంధించిన 20 లక్షల వాట్సాప్ అకౌంట్లను బ్యాన్ చేసింది.ఈ క్రమంలోనే ప్రతి నెలా ప్రపంచ వ్యాప్తంగా 80 లక్షల అకౌంట్లను బ్యాన్ చేస్తుంటే అందులో సుమారు 20 లక్షల అకౌంట్ల దాక మన ఇండియన్ అకౌంట్లే ఉండడం గమనార్హం.

 Whatsapp Blocked 20 Lakh Members Indians Accounts, 20 Laksh, What's Up Accounts,-TeluguStop.com

ఈ సంవత్సరం ఆగస్టులో కొత్త ఐటీ రూల్స్ ప్రకారం 20 లక్షల ఎకౌంట్లకు పైగా బ్యాన్ చేసింది వాట్సాప్.అందులో 222 అకౌంట్ల యూజర్లు తిరిగి అప్పీల్ చేసుకున్నారు.

వాట్సాప్ చాట్ ను అసాంఘీక కార్యకలాపాల కోసం, ఇతరులకు హాని కలిగించే కంటెంట్ ను పంపించడం వంటి అంశాలను దృష్టిలో ఉంచుకొని ఇలా అకౌంట్లను వాట్సప్ బ్యాన్ చేసినట్లు ప్రకటనలో తెలిపింది.

ప్రపంచ వ్యాప్తంగా వాట్సాప్ ను చాలామంది యూజర్లు వినియోగిస్తున్నారు.

ఈ క్రమంలోనే అందరి భద్రతను దృష్టిలో ఉంచుకుని వాట్సాప్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.బ్యాన్ చేసిన అకౌంట్స్ ను తిరిగి అప్పీల్ చేసుకునే క్రమంలోనే ఇండియా గ్రీవెన్స్ ఆఫీసర్ నుంచి కూడా కొన్ని అప్పీల్ వచ్చినట్టు ఆ సంస్థ వెల్లడించింది.

యూజర్ల నుంచి వచ్చిన ఫిర్యాదులను దృష్టిలో పెట్టుకుని వాట్సప్ లోని ఓ టూల్ హానికరమైన అకౌంట్లను బ్యాన్ చేసింది.

Telugu Laksh, Blocked, Harmful, Indian Accoint, Latest, Ups, Whats-Latest News -

ఈ టూల్ వలన అకౌంట్ రిజిస్ట్రేషన్ సమయంలో గాని, మెసేజ్ లను పంపే సమయంలో గాని నెగిటివ్ ఫీడ్ బ్యాక్ ద్వారా ఆయా అకౌంట్లను ఈ టూల్ గుర్తిస్తుంది.ఈ నెగిటివ్ ఫీడ్ బ్యాక్ ఎప్పుడు కూడా చాలా అలెర్ట్ గా ఉంటుంది.ఈ సంవత్సరం జూన్ 16 నుంచి జులై 31 వరకు వాట్సాప్ దాదాపు 3,027,000 అకౌంట్లను బ్యాన్ చేసినట్లు తెలుస్తుంది.

వాటిలో 2,011,000 అకౌంట్లను మే, జూన్ నెలల్లో బ్యాన్ చేసింది.ఇకమీదట అసత్య ప్రచారాలను ప్రచారం చేసిన, వేరే హానికరమైన చర్యలు చేపట్టిన మీ అకౌంట్స్ కూడా బ్యాన్ కి గురువుతాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube