ప్రైవసీ పాలసీ నిబంధనల పై వెనక్కి తగ్గిన వాట్సాప్‌..!- Whatsapp Backs Down On Privacy Policy Terms

WhatsApp delays updated privacy policy after confusing users, WhatsApp, privacy policy , WhatsApp Business Account, WhatsApp Privacy Policy update, Facebook, Hack - Telugu Customer Care, Facebook, Feb8, Hack, Personal Information, Privacy Policy, Whatsapp, Whatsapp Business Account, Whatsapp Delays Updated Privacy Policy After Confusing Users, Whatsapp Privacy Policy Update, Whatsapp-privacy-policy, Whatsup Bussiness Account

ఇటీవల కాలంలో వాట్సప్‌ కొత్త ప్రైవసీ పాలసీని ప్రవేశ పెట్టబోతున్నట్లు వార్తల్లో వచ్చిన సంగతి అందరికి తెలిసిందే.ఈ ప్రైవసీ పాలసీ ద్వారా వ్యక్తిగత సమాచారంతో పాటు ఫోన్ నెంబర్ తదితర వివరాలు.

 Whatsapp Backs Down On Privacy Policy Terms-TeluguStop.com

ఫేస్బుక్ ద్వారా షేర్ చేసిందని వినియోగదారులు అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి కూడా అందరికీ విదితమే.ఈ తరుణంలోనే వాట్సప్ ఈ ప్రైవసీ పాలసీ నిబంధనలు కొన్ని రోజుల పాటు వాయిదా వేసినట్లు తాజాగా కంపెనీ తెలియజేసింది.

వ్యక్తిగత సమాచారాన్ని ఫేస్ బుక్ షేర్ చేసిందన్న కారణంతో చాలామంది వాట్సాప్ వినియోగదారులు టెలిగ్రామ్, సిగ్నల్ యాప్ లపై మొగ్గు చూపారు.ఈ సందర్భంగా వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని సమీక్షించేందుకు ఇంకాస్త సమయం పడుతుందని సంస్థ పేర్కొంది.

 Whatsapp Backs Down On Privacy Policy Terms-ప్రైవసీ పాలసీ నిబంధనల పై వెనక్కి తగ్గిన వాట్సాప్‌..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అంతేకాకుండా ప్రైవసీ పాలసీ పై వస్తున్న తప్పుడు వార్తలను సమాచారాలతో వాట్సప్ వినియోగదారులలో ఆందోళన మొదలయింది.
వాస్తవానికి ఈ కొత్త ప్రైవేట్ పాలసీ నిబంధనలు ఫిబ్రవరి 8 నుంచి అమల్లోకి రావాల్సి ఉంది.

కానీ, తాజాగా వాట్సప్‌ సంస్థ మే 15 వరకు వాయిదా వేసినట్లు ప్రకటించంది.దీనితో ఫిబ్రవరి 8 తర్వాత ఎవరి వాట్సాప్ ఖాతాలను తొలగించడం కానీ నిలిపివేయడం కానీ ఉండదని తెలిపింది.

అంతేకాకుండా ఈ కొత్త ప్రైవసీ విధానం అమల్లోకి రావడంతో వ్యక్తిగత సంభాషణలు సహా ప్రొఫైల్ సంబంధిత ఇతర వివరాలు ఫేస్ బుక్ పంచుకోదని తెలిపింది.

ప్రైవేట్ పాలసీ కేవలం వాట్సాప్ బిజినెస్ చేసే వారికి మాత్రమే అని, అలాగే వాట్సప్ కంపెనీ కస్టమర్ కేర్ తో మాట్లాడడానికి మాత్రమే అని స్పష్టంగా తెలియజేసింది.కేవలం వాట్సాప్ బిజినెస్ ఫ్యూచర్ లో మరింత మెరుగ్గా అందించడం కోసమే ఈ ప్రవేశపెట్టినట్లు తెలిపింది.అంతేకాకుండా వ్యక్తిగత సమాచారాన్ని వాట్సాప్ కానీ, ఫేస్ బుక్ కానీ చూసే అవకాశం ఎట్టి పరిస్థితిలో లేదని తెలియజేసింది.

ఇక ఈ వాయిదా పడిన సమయంలో వినియోగదారులలో ఉన్న సందేహాలు అన్నీ కూడా నివృత్తి చేసేందుకు మేము ప్రయత్నిస్తాము అంటూ వాట్సాప్ సంస్థ పేర్కొంది.యూజర్ యొక్క సందేహాలను నివృత్తి చేసేందుకే ఈ తాత్కాలిక ప్రైవేట్ పాలసీ అప్డేట్ ను వాయిదా వేస్తున్నట్లు వాట్సప్ పేర్కొంది.

#Customer Care #Hack #WhatsAppDelays #Whatsapp #Facebook

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు