వాట్సాప్ అకౌంట్స్ హ్యాక్ ..? అదే కారణం ..?

ఇప్పుడు అంతా స్మార్ట్ ఫోన్ ల మయం అయిపోవడంతో ఫోటోలు.వీడియోలు.

 Whatsapp Accounts Hacked That Is Reason-TeluguStop.com

వీడియో కాల్స్ .ఇలా అన్నిటికీ వాట్సాప్ వాడటం అందరికీ అలవాటు అయిపొయింది.పొద్దున్నే నిద్ర లేవగానే వ్వాట్సాప్ ఓపెన్ చేసి ఎవరు ఎవరు మెసేజెస్ పంపారా అని చూసుకోవడం నిత్యకృత్యం అయిపొయింది.అయితే వాట్సాప్ వాడే వారికి పిడుగులాంటి వార్త … ఫేస్ బుక్ కి చెందిన మెసేజింగ్ సర్వీస్ వాట్సాప్ లో ఒక బగ్ ఉంది.

వాట్సాప్ ఇన్ కమింగ్ వీడియో కాల్ ఆన్సర్ చేసినపుడు హ్యాకర్స్ ఆ యూజర్ల అకౌంట్లను హైజాక్ చేస్తున్నారు.

యూజర్ల ఫోన్లలోని అప్లికేషన్స్ అన్నిటినీ తమ చెప్పుచేతల్లోకి తీసుకుంటున్నారని ప్రముఖ టెక్నాలజీ వెబ్ సైట్లు జడ్ డీ నెట్, ద రిజిస్టర్ ప్రకటించాయి.అటాకర్ నుంచి వచ్చిన కాల్ ఆన్సర్ చేశారంటే వాట్సాప్ ని, దాంతో పాటు మిగతా అప్లికేషన్స్ ను వాళ్ల చేతికి అందించినట్టేనని పరిశోధకులు తెలిపారు.గత ఆగస్టులో యాపిల్, ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లలో వాట్సాప్ అప్లికేషన్స్ దాడికి గురైనపుడు దానిని ఫేస్ బుక్ అక్టోబర్ లో సరిదిద్దింది.

గత ఏడాది ఫేస్ బుక్ పలు భద్రతాపరమైన సమస్యలను ఎదుర్కొంది.గత వారమే భద్రతా లోపాల కారణంగా 50 మిలియన్ల ఫేస్ బుక్ అకౌంట్లు దాడికి గురయ్యాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube