వాట్సాప్ మంచి స్వింగ్ లో వుంది... రాబోతున్న మరో 5 అప్‌కమింగ్ ఫీచర్లు ఇవే!

ప్రపంచ సోషల్ మెసేజింగ్ దిగ్గజం వాట్సాప్ ఎప్పటికప్పుడు కొత్తకొత్త అప్డేట్స్ ఇస్తూ వినియోగదారులకు మంచి కిక్ ఇస్తుంది.వాట్సాప్ డెవలపర్లు నిరంతరం ఈ అప్డేట్ల మీదే కృషి చేస్తున్నారు.

 Whatsapp 5 New Upcoming Features To Its Users Details, Whatsapp, Status , Techno-TeluguStop.com

ముఖ్యంగా చూసుకుంటే, యూజర్ ఇంటర్‌ఫేస్, ప్రైవసీని మెరుగుపరచడమే లక్ష్యంగా కొత్త కొత్త అప్‌డేట్‌లను అందిస్తుంది.కొత్త డెవలప్‌మెంట్‌లతో పాటు, WhatsApp యూజర్లు ఇన్‌స్టంట్ మెసేజ్ ఎక్స్‌పీరియన్స్ మెరుగుపరచడానికి కొన్ని రకాల అప్డేట్స్ ఇస్తోంది.

ఈ నేపథ్యంలో కెమెరా స్విచ్, హై క్వాలిటీని పంపే ఆప్షన్, గ్రూపుల కోసం పెరిగిన టెక్స్ట్ లిమిట్, మరిన్నింటితో సహా అనేక కొత్త ఫీచర్లను తీసుకురానుంది.

Telugu Status, Ups, Wabeta Info, Whatsapp, Whatsapp Tool, Whatsapp Ups-Latest Ne

WAbetainfo ప్రకారం, Android, iOS, వెబ్ యూజర్ల కోసం ఈ కొత్త ఫీచర్లను అభివృద్ధి చేసినట్టుగా తెలుస్తోంది.అయితే ఈ ఫీచర్‌లు ప్రస్తుతం టెస్టింగ్‌ దశలోనే ఉన్నట్టు తెలుస్తోంది.అయితే ఇపుడు ఈ WhatsApp ఫీచర్లు, ఎలా పని చేస్తాయో చూద్దాం.

WhatsApp డ్రాయింగ్ టూల్ హెడర్‌కు కొత్త సెట్టింగ్ ఐకాన్ యాడ్ చేయాలని చూస్తోంది.వాట్సాప్ యూజర్లు తమ ఫొటో క్వాలిటీని ఎడ్జెస్ట్ చేసేందుకు ఇది పనికి వస్తుంది.

కొత్త ఫీచర్‌తో యూజర్లు తమ ఒరిజినల్ క్వాలిటీలో ఫోటోలను పంపుకోవచ్చన్నమాట.

Telugu Status, Ups, Wabeta Info, Whatsapp, Whatsapp Tool, Whatsapp Ups-Latest Ne

అదే విధంగా ఆండ్రాయిడ్ యూజర్ల కోసం లేటెస్ట్ బీటా అప్‌డేట్‌లో WhatsApp గ్రూప్ సబ్జెక్ట్‌లు, వివరణల కోసం టెక్స్ట్ లిమిట్ చాలావరకు పెంచుతోంది.ఇంతకుముందు వాట్సాప్ గ్రూప్ సబ్జెక్ట్ రాసేందుకు 25 అక్షరాలు పరిమితి ఉంటుంది.అది ఇప్పుడు 100 పదాల వరకు పొడిగించింది.

అదనంగా, ప్లాట్‌ఫారమ్ క్యారెక్టర్‌ల లిమిట్ 512 నుంచి 2048కి పెంచుతుంది.ఇది గ్రూప్ క్యాప్షన్ రాసేందుకు అనుమతినిస్తుంది.

ముఖ్యంగా, ఈ ఫీచర్ ప్రస్తుతం ఆండ్రాయిడ్ బీటా టెస్టర్‌ల కోసం అందుబాటులో ఉంది.భవిష్యత్ అప్‌డేట్‌లలో మరింత మంది యూజర్లకు ఈ ఫీచర్ అందుబాటులోకి రానుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube