ఎడిటోరియల్ : జగన్ చేస్తున్న తప్పులేంటి ? నష్టపోతోంది ఎవరు ?  

kodali nani jagan chandrababu tdp ysrcp ap modhi cm Jagan, AP, YSRCP, TDP, BJP Leaders, Kodali Nani, Ap Antharvedi Chariot Fire, Peoples Welfare Schems, - Telugu Ap, Ap Antharvedi Chariot Fire, Bjp Leaders, Kodali Nani, Peoples Welfare Schems, Tdp, Ysrcp

జగన్ పరిపాలన అంతా బాగుంది అని కితాబు ఇచ్చే సమయానికి ఏదో ఒక సంఘటన ఆయనను వివాదాల్లోకి నెట్టేస్తోంది.దేశవ్యాప్తంగా మిగతా రాష్ట్రాలతో పోల్చి చూస్తే, ఏపీలో జగన్ సంక్షేమ పథకాలను దిగ్విజయంగా అమలు చేసుకుంటూ వెళ్తున్నారు.

TeluguStop.com - Whats Wrong With Jagan Who Is At A Loss

ఆర్థిక కష్టాలు చుట్టుముట్టినా లెక్కచేయడం లేదు.కరోనా కారణంగా దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించడంతో అన్ని రాష్ట్రాలు ఆదాయం కోల్పోయి, నిధుల కొరతతో అల్లాడుతున్నాయి.

జగన్ ఏపీలో ఆ లోటు కనిపించనివ్వలేదు సరికదా, మరిన్ని కొత్త పథకాలను ప్రవేశపెట్టి అందరి చేత శభాష్ అనిపించుకున్నారు.కానీ ఆ పార్టీ నాయకుల అవినీతి వ్యవహారాలు కాని, నోటి దురుసు వ్యాఖ్యలతో కానీ, మరి కొన్ని వివాదాస్పద నిర్ణయాలు తీసుకోవడంలో జగన్ జాగ్రత్త పడకపోవడంతో, ఆయనపై పెద్ద ఎత్తున విమర్శలు పెరిగిపోతున్నాయి.

TeluguStop.com - ఎడిటోరియల్ : జగన్ చేస్తున్న తప్పులేంటి నష్టపోతోంది ఎవరు -General-Telugu-Telugu Tollywood Photo Image

గిల్లి గిల్లించుకోవడం కొంతమంది వైసీపీ నాయకులకు, మంత్రులకు మామూలు అయిపోయింది.ప్రభుత్వంపై ఈగ వెళ్లనీయకుండా చూసే క్రమంలో మంత్రి కొడాలి నాని వంటివారు అదుపుతప్పినట్లుగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ, విమర్శల పాలవుతున్నారు.

అప్పటి వరకు జగన్ కు ఉన్న ఇమేజ్ కు మరకలు పడేలా చేస్తున్నారు అనే అభిప్రాయాలు జనాల్లో ఉన్నాయి.

వైసీపీకి టిడిపి ఇప్పుడు బిజెపి రాజకీయ శత్రువే.

అందులో సందేహం లేదు.ఆ పార్టీని కట్టడి చేసేందుకు విమర్శలు చేసినా పెద్దగా ఎవరూ పట్టించుకోరు.

కానీ నాయకులను విమర్శించే క్రమంలో మంత్రి కొడాలి నాని దేవుళ్ళ పైన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.బొమ్మే కదా చేయి విరిగితే ఏమవుతుంది ? రథ మై కథ మా ముఖ్యమంత్రి కొత్తది పెడతారులే అంటూ మరికొన్ని విమర్శలు చేయడం పెద్ద దుమారాన్ని రేపింది.అసలు తిరుమలేశుని దర్శించుకునేందుకు డిక్లరేషన్ అవసరమా ? మసీదులకు, చర్చలకు వెళ్ళినప్పుడు వాళ్ళు ఎవరూ డిక్లరేషన్ అడగడం లేదని, ఎక్కడలేని నిబంధన ఇక్కడ మాత్రం ఎందుకు అంటూ నాని తప్పుబట్టారు.

ఈ వ్యవహారాన్ని పట్టుకుని జగన్ ప్రభుత్వంపై ఏపీ బీజేపీ నాయకులు అధిష్టానానికి ఫిర్యాదు చేశారు.ఒక పక్క కేంద్రంతో సఖ్యత గా ఉంటూ, అన్ని రకాలుగానూ బీజేపీకి మద్దతు ఇస్తూ వస్తున్న జగన్ కు మంత్రుల వ్యాఖ్యలు పెద్ద తలనొప్పిగా మారాయి.ఒక ముఖ్యమంత్రిగా కీలకమైన పదవుల్లో ఉన్న జగన్ అంతర్వేది తో పాటు మరికొన్ని దేవాలయాలపై జరిగిన దాడుల వ్యవహారంలో స్పందించకపోగా వీటిపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఖండించకపోవడం వంటివి ఇప్పుడు ఆయనకు తలనొప్పిగా మారాయి.

ఈ వ్యవహారాలన్నీ వైసీపీ రాజకీయ ప్రత్యర్థులు అందరికీ వరంగా మారాయి.జగన్ ఉద్దేశపూర్వకంగానే ఇలా వ్యవహరిస్తున్నారని, జగన్ ఎక్కడా ఏమీ మాట్లాడకుండా మంత్రులతో ఈ విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారని ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నా, సమాధానం చెప్పుకోలేని పరిస్థితుల్లో వైసీపీ నాయకులు ఉన్నారు.

వైసీపీ పై ఎప్పుడూ విమర్శలు చేద్దామని కాసుకు కూర్చున్న టీడీపీకి ఈ వ్యవహారాలన్ని బాగా కలిసి వస్తున్నాయి.బీజేపీతో పొత్తు పెట్టుకునేందుకు తహతహలాడుతున్న టీడీపీ జగన్ ను ఈ విధంగా హిందూ వ్యతిరేక శక్తిగా ముద్ర వేయించి  బీజేపీకి దగ్గరవ్వాలని చూస్తోంది.చిన్న చిన్న తప్పులే పెద్ద సంచలనాలు గా మారే విధంగా జగన్ చేతుల చేసుకుంటున్నారని, తమ పార్టీ నాయకులను కట్టడి చేసే విషయంలో నిర్లక్ష్యం వహించడంతో, వైసీపీ ప్రభుత్వమే మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది అనేది విశ్లేషకుల అభిప్రాయం.ఈ వ్యవహారాల్లో అంతిమంగా నష్టపోతోంది జగన్ తో పాటు, ఆ పార్టీ నాయకులు, వారితో పాటు వారికి ఓట్లు వేసి గెలిపించిన ప్రజలు కూడా.

#PeoplesWelfare #ApAntharvedi #Ysrcp #Bjp Leaders #Kodali Nani

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Whats Wrong With Jagan Who Is At A Loss Related Telugu News,Photos/Pics,Images..